
ఈ ఫొటోలోని పాప పేరు సోఫియా.. వయసు ఐదేళ్లు.. ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ ఎంతో అందంగా ఉన్న ఈ సోఫియా వెనుక ఓ కన్నీటి కథ దాగి ఉంది. ఐదేళ్ల వయసులో అందరు చిన్నపిల్లల్లా ఆడుకోవాల్సిన ఈ పాప హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పుట్టుకతోనే జన్యు పరంగా సోఫియాకు ఈ వ్యాధి వచ్చింది. సోఫియా పుట్టగానే రెండేళ్లు కంటే ఎక్కువ కాలం బతకదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అయినా ఇప్పటికీ∙జీవితంతో పోరాడుతూ ఆస్పత్రిలో ఉంటోంది. ఇప్పటికే మూడుసార్లు్ల సోఫియాకు శస్త్రచికిత్సలు జరిగాయి.
ఇటీవలే సోఫియాకు మరోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. కానీ అంతకన్నా ముందే పాప తన తల్లిదండ్రులను ఒక విచిత్రమైన కోరిక కోరింది. తన ప్రియ స్నేహితుడైన హంటర్‌ను పెళ్లి చేసుకోవాలని ముద్దుముద్దు మాటలతో తల్లిదండ్రులకు తన కోరికను వెళ్లబుచ్చింది.
పాప అడగడమే ఆలస్యం తన కోసం ఏమైనా చేసే తల్లిదండ్రులు హంటర్ పేరెంట్స్‌తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి సందర్భంగా చేసిన ఫొటోషూట్‌లో తీసిందే ఈ ఫొటో. సోఫియా పెళ్లి కోరిక తీరడంతో ఇక తదుపరి శస్త్రచికిత్సపై వైద్యులు దృష్టిపెట్టారు. జీవితంతో పోరాడుతూ ముందుకు సాగుతున్న సోఫియా ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసుకుని చక్కగా అందరి పిల్లల్లా బడికెళ్లాలని కోరుకుందాం!!
Comments
Please login to add a commentAdd a comment