స్నేహితుల ముందే తల్లి తిట్టడంతో.. | 20-yr-old student kills self in hostel room | Sakshi
Sakshi News home page

స్నేహితుల ముందే తల్లి తిట్టడంతో..

Published Mon, Jul 11 2016 5:33 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

స్నేహితుల ముందే తల్లి తిట్టడంతో.. - Sakshi

స్నేహితుల ముందే తల్లి తిట్టడంతో..

బెంగళూరు:
స్నేహితుల ముందే తల్లి తిట్టడంతో అవమానంగా భావించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అమృతహళ్ళి సమీపంలోని కెంపాపురంలో చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటూ బీబీఎం రెండవ సంవత్సరం చదువుతున్న సోఫియా (20)ను ఆమె తల్లి, స్నేహితుల ముందు తిట్టడంతో అవమానంతో హాస్టల్‌కు వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సోఫియా కెంపాపురంలో ఉన్న ప్రెసిడెన్షి కాలేజీలో బీబీఎం ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

సోఫియా తల్లి ఎలక్ట్రానిక్ సిటి నుంచి శుక్రవారం కాలేజీ ఫీజు కట్టడం కోసం రాగా, కాలేజీలో, హస్టల్లో ఎక్కడా సోఫియా కనిపించలేదు. దాంతో శనివారం మళ్ళీ వచ్చి హాస్టల్ గదిలో తోటి విద్యార్థిణుల మధ్య తిట్టింది. దాంతో స్నేహితుల వద్ద అవమానంగా భావించిన సోఫియా శనివారం రాత్రి అందరు నిద్రపోయాక హాస్టల్ గదిలోఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కెంపాపుర పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలన జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement