Police Visits Will Smith Home Over Drone Sighting Report In Loss Angeles - Sakshi
Sakshi News home page

Will Smith: హీరో విల్‌ స్మిత్‌ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ?

Published Wed, Mar 30 2022 11:28 AM | Last Updated on Wed, Mar 30 2022 12:45 PM

Loss Angeles Police Visits Will Smith Home Over Drone Sighting Report - Sakshi

Police Visits Will Smith Home Over Drone Sighting Report: హాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఆస్కార్‌ గ్రహిత విల్‌ స్మిత్‌ ఆస్కార్‌ 2022 వేదికపై చేసిన పని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌పై విల్‌ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా బెస్ట్‌ డ్యాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇచ్చేందుకు అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ స్టేజ్‌పైకి ఎక్కాడు. అప్పుడు ఏదో మాట్లాడుతూ అనారోగ్యంతో గుండు చేయించుకున్న విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌పై క్రిస్‌ జోక్‌ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్‌ స్మిత్‌ ఆగ్రహంతో క్రిస్‌ రాక్‌ దవడ పగలకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

అయితే తాజాగా విల్‌ స్మిత్‌ ఇంటిని లాస్ ఏంజిల్స్‌ పోలీసులు సందర్శించారు. విల్‌ ఇంటి ఆవరణలో డ్రోన్‌ కనిపించినట్లు పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారట. అందుకే విల్‌ స్మిత్‌ కాలాబాసాన్‌ మాన్షన్‌ను పోలీసులు సందర్శించినట్లు సమాచారం. అయితే విల్‌ ఇంటి ఆవరణలో ఎక్కడా ఎలాంటి డ్రోన్‌ను పోలీసులు గుర్తించలేదట. పోలీసులు వెళ్లే సరికే డ్రోన్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వారు భావించినట్లు తెలుస్తోంది. అలాగే డ్రోన్‌ గురించి పోలీసులకు ఎవరూ సమాచారం అందించారో కూడా స్పష్టత లేదు. బహుశా ఇరుగుపొరుగు వారు ఎవరైనా కాల్‌ చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డ్రోన్‌ను గుర్తించడానికి, ఎవరైనా ఫొటోగ్రాఫర్స్ ఉన్నారా ? లేదా అసలు అక్కడా ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే వారి బృందాన్ని పంపినట్లు పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. 

చదవండి: ఆస్కార్‌ వేడుకల్లో షాకింగ్‌ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement