బాలీవుడ్ హీరో ఇంటికి స్పెషల్ గెస్ట్ | Will Smith parties with Akshay Kumar at his home in Mumbai | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరో ఇంటికి స్పెషల్ గెస్ట్

Published Mon, Aug 29 2016 9:45 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

బాలీవుడ్ హీరో ఇంటికి స్పెషల్ గెస్ట్

బాలీవుడ్ హీరో ఇంటికి స్పెషల్ గెస్ట్

ముంబై: ‘రుస్తుం’ సినిమా సక్సెస్ ను అక్షయ్ కుమార్ ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా? హాలీవుడ్ అగ్ర కథానాయకుడు విల్ స్మిత్తో కలిసి అక్షయ్ గ్రాండ్ గా పార్టీ చేసుకున్నాడు. ఈ ఏడాది మూడు వరుస హిట్లు అందుకున్న అక్కి తన ఇంట్లో ఆదివారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు. దీనికి విల్ స్మిత్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా, ఇతర బాలీవుడ్ తారలు ఈ పార్టీలో పాల్గొన్నారు.

‘అతిథులను అక్షయ్ పేరుపేరునా పలకరించాడు. తన అభిరుచికి అనుగుణంగా వంటలు తయారు చేయించాడు. విల్ స్మిత్ ను అతిథులకు పరిచయం చేశాడు. విల్ స్మిత్ కూడా అందరినీ అప్యాయంగా పలకరించాడు. అతిథులతో కలిసి ఫొటోలు దిగాడ’ని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వరుణ్ ధావన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్, రోహిత్ ధావన్, జాక్వెలెస్ ఫెర్నాండెజ్, శ్రద్ధాకపూర్, అలియా భట్, అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు.

పార్టీ ముగిసిన తర్వాత మీడియా కోసం విల్ స్మిత్, అక్షయ్ కుమార్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఎయిర్ లిఫ్ట్, హౌస్ఫుల్ 3, రుస్తుం సినిమాలతో అక్షయ్ వరుస విజయాలు అందుకున్నాడు. ఈ మూడు సినిమాలు రూ. 100 కోట్ల కలెక్షన్లు దాటడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement