ప్రముఖ హాలీవుడ్ హీరో, ర్యాపర్ విల్ స్మిత్ తనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఫ్యాన్స్‌తో ముచ్చటించిన విల్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా విల్ స్మిత్ తాను 16 ఏళ్లలో ఎదుర్కొన పలు సంఘటనలు ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు. 16 ఏళ్లకే తొలి బ్రేకప్ వంటి చేదు అనుభవాలను చూశానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట!
ఈ మేరకు విల్ స్మిత్ మాట్లాడుతూ.. ‘నా 16 ఏళ్ల వయసులో మెలనియా అనే యువతితో ప్రేమలో ఉన్నాను. కొంతకాలం ఇద్దరం సీరియస్ రిలేషన్‌లో ఉన్నాం. ఈ క్రమంలో ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో భాగంగా నేను రెండు వారాల పాటు మెలనియాకు దూరంగా ఉన్నాను. అదే సమయంలో ఆమె నన్ను మోసం చేసింది. మెలనియా మరో వ్యక్తితో ప్రేమ, ఎఫైర్ పెట్టుకుంది. దీంతో మేమిద్దరం విడిపోయాం’ అంటూ విల్ చెప్పుకొచ్చాడు. ఇక తనతో బ్రేకప్ తర్వాత తీవ్ర ఒత్తిడికి గురయ్యానంటూ విల్ భావోద్యేగానికి లోనయ్యాడు. ‘మెలనియాతో బ్రేకప్ బాధ, ఒత్తిడి నుంచి బయట పడేందుకు వీపరితంగా శృంగారం చేశాను. అయితే మేం రిలేషన్‌లో ఉన్నప్పుడు మెలనియాతో మాత్రమే సన్నిహితంగా ఉన్నాను.
చదవండి: అరెస్ట్ చేయడానికి వస్తే ఇంటి దగ్గర నా మూడ్ ఇలా.. కంగనా సంచలన పోస్ట్
కేవలం తనతోనే శృంగారంలో పాల్గొనేవాడిని. అయితే తనతో విడిపోయాక చాలా మంది మహిళలతో శృంగారం చేశాను. అది కాస్తా తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు గుర్తు చేసుకుంటే అది నేనేనా అనే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆ బాధలో ఏం చేస్తున్నానో నన్ను నేను గమినించుకోలేదు. ఈ వీపరితమైన శృంగారం నాకు విరుద్దంగా, ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేది. దీంతో ఒకానోక సమయంలో నాకు వాంతులు కూడా వచ్చేవి’ అంటూ వివరించాడు. కాగా ప్రస్తుతం ప్రస్తుతం విల్ స్మిత్ ‘కింగ్ రిచర్డ్’ అనే బయోపిక్‌లో నటిస్తున్నాడు. టెన్నిస్ ప్లేయర్స్ వీనస్, సెరెనా విలియమ్స్‌లకు తండ్రి, కోచ్ రిచర్డ్ విలియమ్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ మూవీకి రీనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment