
భారతీయ సాంప్రదాయాలు, ఆచారాల పట్ల పాశ్చాత్యులు ఆకర్షితులవుతున్నారు. అందుకే పలువురు విదేశీ ప్రముఖులు మన దేశంలోని ఆలయాలు పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వస్తుంటారు. వీరిలో హాలీవుడు స్టార్ హీరో విల్‌స్మిత్ కూడా ఉన్నారు. విల్‌స్మిత్ తరుచూ భారత పర్యటన చేస్తుంటారు. తాజాగా మరోసారి ఇండియాలో పర్యంటించిన ఆయన హరిద్వార్‌లో ప్రత్యేక పూజలు చేశారు.
ఓ సామాన్యుడిలా నేలపై కూర్చొని హరిద్వార్ విశిష్టతను తెలుసుకున్నారు. తరువాత గంగా హరతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తన హరిద్వార్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విల్‌స్మిత్ ‘మా బామ్మ ఎప్పుడూ చెపుతూ ఉండేది.. దేవుడు మనకు అన్ని అనుభవం ద్వారా తెలియజేస్తాడు. భారత పర్యటన నాకు నా పట్ల, నా కల పట్ల, ఈ ప్రపంచం పట్ల కొత్త అవగాహన కలిగించింది’ అంటూ కామెంట్ చేశారు. విల్‌స్మిత్ ఈ ఫోటోలు పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 19 లక్షలకు పైగా లైకులు రావటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment