హాలీవుడ్ బ్యాడ్ బాయ్స్ మళ్లీ వస్తున్నారు. హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన ‘బ్యాడ్ బాయ్స్’ నుంచి రానున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. ‘బ్యాడ్ బాయ్స్’ ఫ్రాంచైజీలో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
మూడో భాగానికి దర్శకత్వం వహించిన అదిల్–శ్రీశ్రీబిలాల్ దర్శకత్వ ద్వయమే ‘బ్యాడ్ బాయ్స్ 4’ను డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సిటీలో జరుగుతున్న డ్రగ్ మాఫియా ఆగడాలను ఇద్దరు డిటెక్టివ్‌లు ఏ విధంగా అడ్డుకున్నారు? అనే ఇతివృత్తంతో ఈ సినిమా కథనం ఉంటుందని హాలీవుడ్ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment