bad boys
-
ఇండియాలో ముందుగానే రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ!
విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై. ప్రముఖ ఫ్రాంచైజీలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఒక రోజు ముందుగానే భారతదేశం అంతటా భారీ స్థాయిలో జూన్ 6న విడుదలవుతోంది. ఈ యాక్షన్-అడ్వెంచర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.అత్యంత జనాదరణ పొందిన యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన బ్యాడ్ బాయ్స్ నాల్గొ విడత గురువారం రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
బ్యాడ్ బాయ్స్ రెడీ
హాలీవుడ్ బ్యాడ్ బాయ్స్ మళ్లీ వస్తున్నారు. హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన ‘బ్యాడ్ బాయ్స్’ నుంచి రానున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. ‘బ్యాడ్ బాయ్స్’ ఫ్రాంచైజీలో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మూడో భాగానికి దర్శకత్వం వహించిన అదిల్–శ్రీశ్రీబిలాల్ దర్శకత్వ ద్వయమే ‘బ్యాడ్ బాయ్స్ 4’ను డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సిటీలో జరుగుతున్న డ్రగ్ మాఫియా ఆగడాలను ఇద్దరు డిటెక్టివ్లు ఏ విధంగా అడ్డుకున్నారు? అనే ఇతివృత్తంతో ఈ సినిమా కథనం ఉంటుందని హాలీవుడ్ సమాచారం. -
ఐదుగురు ‘బ్యాడ్ బాయ్స్’ అరెస్టు
విజయవాడ : డీడీ (డేరింగ్ అండ్ డేషింగ్) గ్యాంగ్ పేరుతో ఓ ముఠాగా ఏర్పడి గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కేసులో ఐదుగురిని భవానీపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో అడిషినల్ డెప్యూటీ కమిషనర్ షేక్ నవాబ్ జాన్ వివరాలను వెల్లడించారు. విజయవాడ భవానీపురం ప్రియదర్శిని కాలనీకి చెందిన గుంటూరు ప్రవీణ్ కుమార్ అలియాస్ ప్రవీణ్ (27), ముత్యం నాగరాజు (21), పెద్దిశెట్టి సాయిదుర్గాప్రసాద్ (21), పెద్ది శివరామకృష్ణ (21), మేడిశెట్టి విజయబాబు (21) లను అరెస్టు చేశారు. నిందితులపై గతంలో కొట్లాటలు, దొంగతనాల కేసులు ఉన్నాయి. వీరు మరో ఐదుగురు పాత నేరస్తులతో కలిసి భవానీపురం ఏరియాలో కొందరిని బెదిరించి డబ్బు దోచుకున్నారు. కొందరు యువకులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎరవేసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే వారికి భయపడి బాధితులు ఫిర్యాదు చేయటానికి ముందుకు రావటం లేదు. ఈ క్రమంలో పోలీసులు నిందితులపై నిఘా పెట్టి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఐదుగురు పాత నేరస్తులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడు జూపూడి వంశీ రాంబాబు, నవీన్ రెడ్డి, ఎండీ అలీ రాజమండ్రి సెంట్రల్ జైలులో వేరే కేసుల్లో రిమాండ్‌లో ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తేలింది. ఇటువంటి తరహా కేసులపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఏడీసీపీ షేక్ నవాజ్ జాన్ కోరారు. విలేకరుల సమావేశంలో వెస్ట్ ఏసీపీ గున్నం రామకృష్ణ, భవానీపురం సీఐ వైబీ రాజాజీ పాల్గొన్నారు. -
వివాదంలో హీరో ‘అనధికార’ బయోగ్రఫీ
ముంబై: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా అనధికారికంగా విడుదలైన ‘ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బాడ్ బాయ్’ పుస్తక రచయిత, పబ్లిషర్స్‌పై సంజయ్ దత్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమతున్నారు. త్వరలోనే నిజమైన, అధికారిక బయోగ్రఫీ విడుదల అవుతుందని సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. బాలీవుడ్స్ బాడ్ బాయ్స్ పుస్తక రచయిత యాస్సర్ ఉస్మాన్‌కు, పబ్లిషర్ జుగ్గర్నాట్కు నోటీసులు పంపారు. అలాగే వీరికి తాను తన బయోగ్రఫీ రాసేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. పుస్తకంలో తాము ఎటువంటి సమాచారం జొప్పించలేదని, కేవలం పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం మాత్రమే ప్రచురించడానికి ఉపయోగించామని పబ్లిషర్ జుగ్గర్‌నాట్ తెలిపింది. గతంలో పత్రికల్లో ప్రచురితమైన సమాచారం, తాను ఇచ్చిన ఇంటర్వ్యూలు, 1990 దశకంలో గాసిప్ మ్యాగజైన్లు రాసిన ఊహాజనితమైన సమాచారం ఆధారంగా చేసుకుని పుస్తకం రాశారని, అందులో తప్పుడు సమాచారం ఉందని సంజయ్ పేర్కొన్నారు. ఈ విషయం తనను, తన కుటుంబసభ్యులకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. సునీల్ దత్, నర్గీస్ ఎలా, ఎప్పుడు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సంజయ్ దత్ జననం, బోర్డింగ్ స్కూల్లోసంజయ్ దత్ జీవనం, తల్లి నర్గీస్ మరణం, సోదరి,తండ్రితో సంజయ్ బంధం, మాదక ద్రవ్యాలకు బానిస కావడం, వాటి నుంచి బయటపడటం, సంజయ్ పెళ్లి, అండర్‌వరల్డ్‌తో సంబంధాలు, ముంబై బాంబు పేలుళ్ల కేసు, ప్రస్తుతం సంజయ్ దత్ పరిస్థితి తదీతర విషయాలు ‘ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బాడ్ బాయ్’లో చర్చకు వచ్చాయి. -
బ్యాడ్ బాయ్స్
-
'బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ నా వీక్ నెస్'
లాస్ ఏంజెలిస్: ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన బలహీనతలను బయటపెట్టింది. తాను ఎప్పుడూ బ్యాడ్ బాయ్స్ తోనే డేటింగ్ చేయడానికి ఇష్టపడతానంది. గతంలో కూడా చాలా మంది బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ చేశానని చెప్పింది. మారీ క్లేరీ మేగజైన్ రిపోర్టర్ కు ఈ వివరాలు తెలిపింది. కొద్దికాలం కిందటే ఈ పాప్ అందగత్తె సెలెనా గోమెజ్ తన లవర్ జస్టిన్ బీబర్‌కు బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే బీబర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిందా? లేక ఆ తర్వాత మరెవరితోనైనా ఆమె డేటింగ్ చేస్తుందా అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. బ్యాడ్ బాయ్స్ తన వీక్ నెస్ అనటంతో అక్కడి యువకులు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. అమీ స్కూమర్, జెన్నిఫర్ లారెన్స్ లను ప్రశంసించింది. వారు అందరు మహిళల మాదిరిగా ఉండరని, అంతకంటే ఎక్కువ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది. సెలెనా తో బ్రేకప్ అయ్యాక జస్టిన్ బీబర్ మాత్రం కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుండగా, ఈ అమ్మడు మాత్రం తన మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆల్బమ్స్ కోసం ఎంతో శ్రమ పడుతున్న సెలెనా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కునే పనిలో పడిందా.. గతాన్ని మళ్లీ తవ్వుకుంటూ బాధలో ఉందా సన్నిహితులు, అభిమానులు తెలుసుకోలేక పోతున్నారు.