
బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ తాజా చిత్రం గల్లీబాయ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాపై హాలీవుడ్ స్టార్ హీరో విల్‌స్మిత్ స్పందించారు. రణ్‌వీర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు విల్ స్మిత్. దీంతో రణ్‌వీర్ అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
గత ఏడాది విల్ స్మిత్ భారత పర్యటన సందర్భంగా రణ్‌వీర్ ఆయన్ను కలిసారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న సూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాలోని ప్రత్యేక గీతం కోసం విల్ స్మిత్ 2018లో ఇండియా వచ్చారు. అదే సమయంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయి. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన గల్లీబాయ్ సినిమాలో రణ్‌వీర్‌కు జోడిగా అలియా భట్ నటించారు.
“ Yo Ranveer congrats man I am loving what you’re doing with Gullyboy for me old school hip hop here seeing hip hop all over the world like that I am loving it man congrats “ - Will Smith to Ranveer Singh
— RanveerSingh TBT💗 (@RanveerSinghtbt) 16 February 2019
-
OMGGGG!!!!! 😍♥️♥️ pic.twitter.com/AzZWjDmZLk
Comments
Please login to add a commentAdd a comment