ఒక్క మెసేజ్‌తో 'సలార్‌' బైక్‌ను సొంతం చేసుకోండి | Salaar Movie Team Announced Bike Offer | Sakshi
Sakshi News home page

ఒక్క మెసేజ్‌తో 'సలార్‌' బైక్‌ను సొంతం చేసుకోండి

Published Sat, Apr 20 2024 7:05 AM | Last Updated on Sat, Apr 20 2024 7:31 AM

Salaar Movie Team Announced Bike Offer - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సలార్‌. గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్‌ చేసింది. దీంతో వెంటనే ‘సలార్‌’ రెండో భాగం ‘సలార్‌: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్‌ నీల్‌. ప్రీ ప్రోడక్షన్‌ వర్క్‌ పూర్తి కావస్తుండటంతో ఇదే నెలలో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది.

సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్‌ ఇప్పుడు బుల్లితెరలో వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో సలార్ మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్‌ ప్రకటించింది.

ఏ విధంగా సలార్‌ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్‌ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.. ఏప్రిల్‌ 21న సలార్‌ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుందట, ఆ బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలి. అదే సమయంలో ఎస్సెమ్మెస్ లైన్లు ప్రారంభమౌతాయి. ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్‌ చేసి పంపించాలి. ఈ ఎస్సెమ్మెస్‌లను ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి పంపించాల్సి ఉంటుంది. దీంతో సలార్‌లో ప్రభాస్‌ ఉపయోగించిన బైక్‌ మాడల్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని ఆయన ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement