తమిళసినిమా: ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయిన కన్నడ త్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్–2, విక్రాంత్ రోణా, చార్లీ 777, కాంతార తదితర చిత్రాలు ఇతర పరిశ్రమలను కన్నడం వైపు తిరిగి చూసేలా చేశాయి. 2022లో ఈ 5 చిత్రాలు కలిపి రూ.1,851 కోట్ల వసూళ్లు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేశాయి. కాగా తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతుంది. దీని పేరు కేడీ ది డెవిల్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ కేడీఎం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న నాలుగవ చిత్రం ఇది. అదేవిధంగా కర్ణాటక నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు.
ధృవ సర్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందన్నారు. ఉదాహరణకు రాముడు ఉన్న కాలంలోనే రావణుడు ఉన్నాడని పేర్కొన్నారు. యాక్షన్, సెంటిమెంట్, వినోదం వంటి జనరంజకమైన అంశాలతో రపొందిస్తున్న చిత్రం కేడీ ది డెవిల్ అని తెలిపారు.
కాగా కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల బెంగుళూరులో భారీఎత్తున నిర్వహించినట్లు నిర్మాత తెలిపారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment