తమిళసినిమా: ఈ ఆధునిక యుగంలో ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగా దర్శక నిర్మాతలు కథలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. అయితే దర్శకుడు శంకర్ తన చిత్రాల కథల విషయంలో మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జెంటిల్‌మెన్ నుంచి 2.ఓ చిత్రం వరకు ఈయన చిత్రాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయన్నది తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో రా మ్‌చరణ్ కథానాయకుడిగా చేస్తున్న చిత్రంతో పాటు తమిళంలో కమలహాసన్ హీరోగా ఇండియన్–2 చిత్రాన్ని చేస్తున్నారు. వీటి తరువాత పొన్నియన్ చిత్ర హిందీ రీమేక్‌కు సిద్ధం అవుతారని సమాచారం.
ఆ తరువాత రూ. 1000 కోట్ల బడ్జెట్‌లో ఒక చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. లోక్‌సభ సభుయడు ఎస్.వెంకటేశ్ చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పాలి నవలను చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీని స్క్రీన్‌ప్లేను వెంకటేశ్, శంకర్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీనిని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రంలో సూర్య కథానాయకుడుగా నటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈయన బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రం, శివ దర్శకత్వంలో తాను 42వ చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చేయాల్సి ఉంది. ఆ తరువాత శంకర్ దర్శకత్వంలో నటించే అవకా శం ఉందని టాక్. ఇలాంటి చారిత్రక కథా చిత్రాలు కోలీవుడ్‌లో వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగులో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలు రూపొంది సంచలన విజయం సాధించాయి. వాటి ఇన్సిఫిరేషన్‌తోనే శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే ఇంకా చాలా టైమ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment