
పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 వంటి పరభాషా చిత్రాలు జాతీయ స్థాయిలో సంచలన విజయాలను అందుకోవడంతో తమిళ చిత్రాల గురించి పెద్ద చర్చే సాగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ సినీ పరిశ్రమ భయపడాల్సిన అవసరం లేదని నమ్మకాన్ని పెంచే వ్యాఖ్యలు చేశారు. హనీ ప్లిక్స్ అనే సంస్థ చిత్ర నిర్మాణ ఖర్చులు తగ్గించడం వంటి పలు ప్రయోజనాలు చేకూరేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది.
సోమవారం జరిగిన సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మణిరత్నం మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమ గురించి భయపడాల్సిన పని లేదని, ఇతర భాషా చిత్రాలకు పోటీ ఇస్తోందన్నారు. మన చిత్రం చంద్రలేఖ అప్పట్లోనే హిందీలో సంచలన విజయం సాధించిందన్నారు. అదే విధంగా దక్షిణాది సినిమా ఇప్పుడు తన పరిధిని పెంచుకుందన్నారు. ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెరిగిందని అభిప్రాయపడ్డారు. యువ దర్శకులు విజువల్ వండర్స్ సృష్టిస్తున్నారని, ఆరోగ్యకరమైన పోటీ మంచిదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత టీజీ త్యాగరాజన్, నటుడు ప్రశాంత్ పాల్గొన్నారు.
చదవండి: రాజీవ్‌తో గొడవలు నిజమే, కానీ విడాకులు.. యాంకర్ సుమ ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment