నిమ్మకాయల ప్రసాద్, రానా, దుల్కర్ సల్మాన్, నాని, ఐశ్వర్యా లక్ష్మి
‘‘మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు.
ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజ మైన నిర్వచనం ఇదే’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ , ఐశ్వర్యా లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘దుల్కర్ ‘ఓకే బంగారం’ సినిమాలో నా వాయిస్ ఉంది.
తన జర్నీలో నా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు నేను ఫీలవుతున్నాను. ‘సీతారామం’తో తను తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు. ఈ సినిమాతో ఆ ప్రేమ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘కింగ్ ఆఫ్ కోత’ పెద్ద విజయం సాధించాలి. ’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ–‘‘దుల్కర్ ఓ వైల్డ్ యాక్షన్ ఫిల్మ్ చేశాడంటే నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘ నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘కింగ్ ఆఫ్ కోత’. నాలుగు భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో దుల్కర్ కొత్తగా కనిపిస్తారు’’ అన్నారు జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ్స ఐశ్వర్యా లక్ష్మి, అనిఖా సురేంద్రన్ , నటుడు షబ్బీర్, నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment