
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరోసారి వీరిద్దరు జతకట్టడంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాని మాట్లాడుతూ.. 'కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమానే సరిపోదా శనివారం. ఇది చాలా నమ్మకంగా చెబుతున్నా. కొవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని చాలామంది అంటున్నారు. కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా వస్తారు. వస్తూనే ఉంటారు. ఆడియన్స్ ఎప్పుడూ మిస్ అవ్వరు. మనమే అప్పుడప్పుడు మిస్సవుతుంటాం. పోతారు.. మొత్తం పోతారు.. ఆగస్టు 29 అందరూ థియేటర్లకే పోతారు. వివేక్ ఆత్రేయ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment