సలార్‌ VS డంకీ: రెఢీ | Box Office War: Shah Rukh Khan's Dunki vs Prabhas Salaar On December 22 | Sakshi
Sakshi News home page

సలార్‌ VS డంకీ: రెఢీ

Published Sat, Sep 30 2023 4:32 AM | Last Updated on Sat, Sep 30 2023 8:55 AM

Box Office war: Shah Rukh Khan Dunki vs Prabhas Salaar on Releases Date - Sakshi

రెండు పాన్‌ ఇండియా సినిమాలు ఒకేరోజు థియేటర్లకు వస్తే.. ఏ సినిమా చూడాలి? అనేది ప్రేక్షకుల ముందుండే ప్రశ్న. ఏ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి? అనేది ఎగ్జిబిటర్ల ముందుండే ప్రశ్న? ఏ సినిమాని ఏ ఏరియాకి ఎంత ఇచ్చి కొనాలి? అనేది డిస్ట్రిబ్యూటర్ల ముందుండే ప్రశ్న.. అసలు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం కరెక్టేనా? బిజినెస్‌ ఎఫెక్ట్‌ అవుతుందేమో.. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు,ప్రొడ్యూసర్లు.. ఇలా అందరి ముందుండే ప్రశ్న.

శుక్రవారం వచ్చిన ‘సలార్‌’ విడుదల తేదీ (డిసెంబర్‌ 22) ప్రకటన ఈ ప్రశ్నలకు కారణమైంది. అదే రోజు షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ కూడా రిలీజ్‌ కానుంది. బాక్సాఫీస్‌ను ఢీ కొట్టడానికి రెడీ అవుతున్న ‘సలార్‌’, ‘డంకీ’... చిత్రాల్లో ఏది వసూళ్లను కొల్లగొడుతుంది? ఈ రెండింటి కారణంగా వేరే చిత్రాలు వాయిదా పడతాయా? ఓ లుక్కేద్దాం.
 
ఇండియన్‌ సినిమా బడా సూపర్‌ స్టార్స్‌ ప్రభాస్, షారుక్‌ ఖాన్‌ బాక్సాఫీస్‌ ఫైట్‌కి రెఢీ అయ్యారు. పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘సలార్‌’లోని తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ను డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నట్లుగా ఈ చిత్ర యూనిట్‌ శుక్రవారం ప్రకటించింది. నిజానికి 2022 ఏప్రిల్‌ 14న విడుదల చేయాలనుకుని, ఆ తర్వాత 2023 సెప్టెంబరు 28కి వాయిదా వేశారు. తాజాగా డిసెంబర్‌ 22 అంటున్నారు.

ఇంకోవైపు మరో పాన్‌ ఇండియన్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’. హిందీలో ‘మున్నాభాయ్‌ ఎమ్‌బీబీఎస్‌’, ‘3 ఇడియట్స్, ‘పీకే’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్స్‌ తీసిన అగ్రశ్రేణి దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి ఈ సినిమాకు దర్శకుడు. షారుక్, రాజ్‌కుమార్‌.. ఈ ఇద్దరికీ విడివిడిగా రికార్డులు ఉండటంతో తొలిసారి ఇద్దరూ కలిసి చేస్తున్న ‘డంకీ’ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్‌ హిరాణి, జ్యోతిదేశ్‌ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా 2022 ఏప్రిల్‌ 19న ‘డంకీ’ సినిమాను ప్రకటించిన రోజే విడుదల తేదీని (22 డిసెంబరు 2023) కూడా ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ ఇదే రోజున ‘సలార్‌’ విడుదలను నిర్ణయించడం ఇటు తెలుగు అటు హిందీతో పాటు పాన్‌ ఇండియా సినిమాలు కాబట్టి.. ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది.

ఎవరి రికార్డులు వారివి...
‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో (2019)’, ‘రాధేశ్యామ్‌ (2022)’, ‘ఆదిపురుష్‌ (2023)’ చిత్రాలకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ప్రభాస్‌కు ‘సలార్‌’ హిట్‌ కీలకంగా మారింది. ఇటు ‘జీరో (2018)’ రిజల్ట్‌తో షారుక్‌ ఖాన్‌ డీలా పడ్డప్పటికీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ‘పఠాన్‌’, ‘జవాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద కొత్త రికార్డులను క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా ‘జవాన్‌’ చిత్రం కలెక్షన్స్‌లో హిందీ హయ్యెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిందని యూనిట్‌ పేర్కొంది. ఇవి షారుక్‌ ఖాన్‌ సూపర్‌ఫామ్‌ను స్పష్టం చేస్తున్నాయి.

అలా అని ప్రభాస్, ప్రశాంత్‌ నీల్‌ సినిమాలనూ తక్కువ చేయలేం. ఎందుకంటే ప్రభాస్‌ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ మొత్తం వసూళ్లను షారుక్‌ ఏ సినిమా కూడా ఇంకా అధిగమించలేదని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే షారుక్‌ కెరీర్‌లో ఓ డిజాస్టర్‌గా నిలిచిన ‘జీరో’ రిలీజైన రోజున.. అంటే డిసెంబరు 21నే ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 1’ (యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూ΄÷ందింది) విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, కొత్త రికార్డులను సృష్టించింది. ఇలా ప్రశాంత్‌ నీల్, షారుక్‌ ఖాన్‌ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద ఢీ కొనడానికి రెడీ కావడం ఆసక్తికరమైన విశేషం. ఎవరి రికార్డులు వారికి ఉన్న నేపథ్యంలో తాజా ΄ోటీలో రికార్డ్‌ ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది.

ఫుల్‌ కన్‌ఫ్యూజన్‌
నో కన్‌ఫ్యూజన్‌..‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ను డిసెంబరు 22న విడుదల చేస్తున్నాం అంటూ ‘సలార్‌’ టీమ్‌ ప్రకటించింది. అయితే ‘సలార్‌’కు కన్‌ఫ్యూజన్‌ అక్కర్లేక΄ోవచ్చు కానీ 2023 క్రిస్మస్‌కు ఆల్రెడీ రిలీజ్‌ను కన్ఫార్మ్‌ చేసుకున్న తెలుగు చిత్రాల విడుదల విషయం ఇప్పుడు ఫుల్‌ కన్‌ఫ్యూజన్‌. డిసెంబరు 21న నాని ‘హాయ్‌ నాన్న’, 22న వెంకటేశ్‌ ‘సైంధవ్‌’, సుధీర్‌బాబు ‘హరోం హర’, 23న నితిన్‌ ‘ఎక్స్‌ట్రా’ చిత్రాలు విడుదలకు షెడ్యూల్‌ అయ్యాయి. ఇప్పుడు ‘సలార్‌’ ఎఫెక్ట్‌తో ఈ సినిమాల విడుదల వాయిదా పడే అవకాశం ఉంటుంది.

ఒకవేళ అప్పుడు వాయిదా వేసి, సంక్రాంతికి వద్దామనుకుంటే ఆల్రెడీ పండగ బరిలో నాగార్జున ‘నా సామిరంగ’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్‌’, విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), తేజా సజ్జా ‘హనుమాన్‌’ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు శివ కార్తికేయన్‌ ‘అయలాన్‌’, సుందర్‌. సి ‘అరణ్మణై 4’ ఉన్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలంటే థియేటర్ల సంఖ్య ప్రశ్నార్థకమవుతుంది... దాంతో పాటు వసూళ్లు కూడా షేర్‌ అయి΄ోతాయి కాబట్టి వీటిలో ఏదైనా వాయిదా పడే అవకాశమూ లేక΄ోలేదు. ఇక ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2098 ఏడి’ కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా వాయిదా పడే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.  
‘సలార్‌’, ‘డంకీ’... ప్రకటించిన ప్రకారం డిసెంబర్‌ 22నే వస్తాయా? ఇవి వస్తే ఏ చిత్రాలు వెనక్కి వెళతాయి? సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలేంటి? అనేది తెలియాలంటే
కొంత సమయం వేచి ఉండక తప్పదు.       

ఆ తేదీకే ఎందుకు?
ఓ సినిమా బాక్సాఫీస్‌ సరికొత్త రికార్డులను సృష్టించాలంటే సరైన రిలీజ్‌ డేట్‌ కూడా ముఖ్యం. ఇప్పుడు ‘సలార్‌’, ‘డంకీ’ చిత్రాలు డిసెంబరు 22ను ఎంచుకోవడం సరైనదే. ఎందుకంటే ఆ రోజు నుంచి వారాంతం ఆరంభమవుతుంది. సరిగ్గా క్రిస్మస్‌ సెలవులు కూడా మొదలవుతాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం ఖాయం. ఒకవేళ ఈ చిత్రాలు హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే.. న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి వరకూ ప్రదర్శనకు స్కోప్‌ ఉంటుంది. సంక్రాంతి సెలవుల టార్గెట్‌గా కొత్త చిత్రాలు వస్తాయి. అప్పుడు ‘సలార్‌’, ‘డంకీ’కి థియేటర్లు తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ పండగ టైమ్‌లో వచ్చే చిత్రాలకన్నా ఈ రెండూ బంపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే అప్పుడు సంక్రాంతి సెలవులను కూడా క్యాష్‌ చేసుకుంటాయి. ఈ చిత్రాల టాక్‌ ముందే తెలిసి΄ోతుంది కాబట్టి.. సంక్రాంతికి వచ్చే చిత్రాల్లో ఏదైనా వాయిదా పడే అవకాశం కూడా లేక΄ోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement