Saravanan Arul Starrer the Legend Set for OTT Premiere March 3rd - Sakshi
Sakshi News home page

The Legend Movie OTT Streaming: 7 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన ది లెజెంట్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Published Fri, Mar 3 2023 2:11 PM | Last Updated on Fri, Mar 3 2023 2:44 PM

Saravanan Arul Starrer The Legend Set for OTT Premiere March 3rd - Sakshi

తమిళ బడా వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే.  53 ఏళ్ల శరవణన్‌ గతేడాది ‘ది లెజెండ్‌’ అనే పాన్‌ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో రిచ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. 50వ ఏటా హీరోగా మారిన శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్‌ కూడా వచ్చాయి. ఆయనే స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమాకి స్టార్ టెక్నికల్ టీమ్‌ను నియమించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యింది. విడుదలైన ఏడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.

చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత

గతేడాది జూలైలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(మార్చి 3న) ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ది లెజెండ్‌ హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కాగా ఇందులో శరవణన్ సరసన లక్ష్మిరాయ్, బాలీవుడ్‌ బ్యూటీ, పాపులర్ మోడల్ ఊర్వశి రౌటేలా హీరోయిన్లుగా నటించారు.  శరవణన్ స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమాని జేడీ-జెర్రీ దర్శకద్వయం తెరకెక్కించగా.. రఘువరన్ బిటెక్ ఫేమ్ ఆర్. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ, హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

చదవండి: కాబోయే భార్య ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement