
Rajendra Prasad First Look Released From Sasana Sabha: వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే అతికొద్ది నటుల్లో డా. రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'శాసన సభ'. ఇందులో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించగా, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన తులసీ రామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిర అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్రబృందం.
ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాలో ఎమ్మెల్యే నారాయణ స్వామిగా రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. ''ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్. యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే నారాయణ స్వామిగా నటిస్తున్నారు.
చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి
విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన రోల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో చేయనటువంటి విభిన్నమైన పాత్ర ిది. ఈ సినిమాకు ఆయన పాత్రే హైలెట్‌గా నిలుస్తుంది. అలాగే మా సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని నిర్మాతలు తెలిపారు.
చదవండి: థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో..
Wishing all a very happy Independence Day #IndiaAt75
— Ramesh Bala (@rameshlaus) August 15, 2022
- Team #Sasanasabha #IndraSena #RajendraPrasad #VenuMadikanti #ShanmugamSappani #Thulasiramsappani @RaviBasrur #AishwaryaRaj @soniya_agg @sapbrofilms @kaanistudio #HappyIndependenceDay pic.twitter.com/D9FVJxuxTs
Comments
Please login to add a commentAdd a comment