హీరో నిఖిల్ సిద్ధార్థ వియత్నామ్‌లో వాలిపోయారు. ఏదో వెకేషన్‌కి వెళ్లుంటారేమో అనుకుంటే పొరబడినట్టే. తన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కోసం నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు వియత్నామ్ వెళ్లారాయన. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న మూవీ ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో యోధునిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్రకు సంబంధించి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు. సైగాన్‌లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌లు ‘స్వయంభూ’ యూనిట్లో భాగంగా ఉండి యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్‌కి శిక్షణ ఇస్తారు. నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు నిఖిల్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్.
Comments
Please login to add a commentAdd a comment