పదకొండేళ్ల క్రితమే పాన్‌ ఇండియా స్టార్‌ని..పోల్చితే నచ్చదు: శ్రుతీహాసన్‌ | Shruti Haasan Says She Has Been A Pan-Indian Actor For More Than A Decade | Sakshi
Sakshi News home page

Shruti Haasan: పదకొండేళ్ల క్రితమే పాన్‌ ఇండియా స్టార్‌ని.. వారితో పోల్చితే నచ్చదు

Published Tue, Jan 30 2024 12:51 PM | Last Updated on Tue, Jan 30 2024 2:04 PM

Shruti Haasan Says She Has Been A Pan Indian Actor For More Than A Decade - Sakshi

‘‘నేను కెరీర్‌ ఆరంభించినప్పుడు (2009లో హిందీ చిత్రం ‘లక్‌’తో  హీరోయిన్‌గా పరిచయం అయ్యారు) సోషల్‌ మీడియా లేదు.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ లేవు. ఒకవేళ ఉండి ఉంటే నటిగా నేను చేసినవి ఇంకా ఎక్కువమంది ప్రేక్షకులు చూసి ఉండేవారు. అయినప్పటికీ కెరీర్‌ విషయంలో, నా అప్పటి దశ పరంగా నేను హ్యాపీగా ఉన్నాను’’ అని శ్రుతీహాసన్‌ అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్‌ ఇండియా ఫిల్మ్ప్‌ గురించిన ప్రశ్న శ్రుతీకి ఎదురైంది.

ఆ విషయం గురించి శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘పదకొండేళ్ల క్రితమే నేను పాన్‌ ఇండియా స్టార్‌ని. అప్పట్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే పాన్‌ ఇండియా అనే పదాన్ని నేను అప్పుడే వాడాను. నాకు పాన్‌ ఇండియా ఫీవర్‌ లేదు. అయితే అన్ని రకాల భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు పాన్‌ ఇండియా అంటూ పోటీలో ఉన్న మేల్, ఫీమేల్‌ యాక్టర్లతో నన్ను నేను పోల్చుకోను. ఎందుకంటే కొన్నేళ్ల క్రితమే నేను పాన్‌ ఇండియా సినిమాలు చేసేశాను. కెరీర్‌ పరంగా నా విధానాన్ని నేను ఫాలో అయ్యాను. నన్ను ఎవరితోనైనా పోల్చితే నచ్చదు’’ అన్నారు.

ఇక ప్రస్తుతం శ్రుతీహాసన్‌ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... అడివి శేష్‌తో ‘డెకాయిట్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆమె నటించనున్న ఇంగ్లిష్‌ మూవీ ‘చెన్నై స్టోరీస్‌’ షూటింగ్‌ ఆరంభం కావాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement