
విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటున్నారు విజయ్ సేతుపతి. కోలీవుడ్, టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాడు. అయితే అతన్ని మాత్రం పాన్ ఇండియా స్టార్ అంటే ఫైర్ అవుతున్నాడు. నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలవకండి అని అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను కేవలం నటుడిని మాత్రమే. దయచేసి నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలవకండి. ఆ ట్యాగ్ నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. కొన్ని సార్లు ఒత్తిడికి కూడా గురి చేస్తోంది. మళ్లీ చెబుతున్నా..నేను కేవలం నటుడిని మాత్రమే. అన్ని భాషల్లో నటించాలనుకుంటున్నాను. ఎక్కడ అవకాశం వచ్చినా వెళ్లి నటిస్తాను’ అన్నారు.
96 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. ఆ తర్వాత సైరా, ఉప్పెన, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో టాలీవుడ్‌లో కూడా అభిమాన దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నటించిన మైఖేల్ చిత్ర ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మేరి క్రిస్మస్ చిత్రంలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment