
ఆడియన్స్‌కు ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించేందుకు రెడీ అవుతున్నారు హీరోలు సందీప్ కిషన్, విజయ్ సేతుపతి. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ బహు భాషా చిత్రానికి రంజిత్ జయకొడి దర్శకుడు. ‘ది ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్, ‘స్త్రీ’ చిత్రాల దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఆల్రెడీ స్టోరీ సిట్టింగ్స్ పూర్తయ్యాయి.
ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. ఇంకో విశేషం ఏంటంటే... రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీమ్యాన్’ ఫస్ట్ సీజన్‌లో సందీప్ నటించారు. అలాగే రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో రానున్న షాహిద్ కపూర్ ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్) వెబ్ సిరీస్‌లో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్నారు. ఇలా విడివిడిగా వెబ్ సిరీస్‌కి కుదిరిన ఈ కాంబినేషన్ సినిమాకి సెట్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment