Samantha To Play Lead Role In Taapsee Next Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha - Taapsee: పాన్ ఇండియా మల్టీస్టారర్‌పై సామ్‌ ఫోకస్‌.. అప్పుడు నయన్‌, ఇప్పుడు తాప్సీ

Published Wed, Jul 6 2022 3:56 PM | Last Updated on Wed, Jul 6 2022 5:07 PM

Samantha Play Lead Role In Taapsee Next Movie - Sakshi

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ పాన్‌ ఇండియా మార్కెట్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. కమల్‌ హాసన్‌ విక్రమ్‌ కూడా మల్టీస్టారర్‌గా వచ్చి.. కోలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ పై హీరోయిన్స్ కూడా ఇంట్రెస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సమంత పాన్ ఇండియా మల్టీస్టారర్ సెట్ చేస్తూ ముందుకెళ్తోంది. 

కోలీవుడ్ వరకు వెళ్లి అక్కడ నయనతారతో, కణ్మణి రాంబో కతిజా(కేఆర్‌కే) చేసింది. సమంత.ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్ కనిపించడంతో ఆ  సినిమా ఏకంగా ఈ ఏడాది కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి గా నిలిచింది. అందుకే సేమ్ సీన్ ను బాలీవుడ్ లోనూ రిపీట్ చేయాలనుకుంటోంది సమంత.అక్కడి లీడింగ్ లేడీ తాప్సీతో కలసి పాన్ ఇండియా మూవీ చేయనుంది సమంత. కొద్ది రోజుల క్రితమే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటూ రూమర్ వచ్చింది. ఇప్పుడు అదే వార్త నిజమైంది.

(చదవండి: రామ్‌పై బాలయ్య సెంటిమెంట్ ను అప్లై చేస్తున్న బోయపాటి!)

ప్రస్తుతానికి తాప్సీ బ్యానర్ లో సమంత నటించే చిత్రానికి సంబంధించి స్టోరీ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో తాను కూడా ఓ కీలకమైన పాత్రలో నటించేందుకు సిద్ధం అంటోంది తాప్సీ. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానంటోంది. సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ స్టార్ డమ్ అందుకుంది తాప్సీ. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న డంకీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు తాప్సీ దారిలోనే సమంత కూడా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement