Actress Samantha: She Gave Clarity On Her Bollywood Entry - Sakshi
Sakshi News home page

Samantha: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి

Nov 22 2021 5:39 PM | Updated on Nov 22 2021 6:20 PM

Samantha Gave Clarity On Her Bollywood Entry And Says She Was Ready - Sakshi

Samantha Gave Clarity On Rumours: విడాకుల అనంతరం సమంత పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. విడాకుల ప్రకటన ఆనంతరం ఆ బాధ నుంచి బయట పడేందుకు ఆమె తీర్థ యాత్రలు, పర్యాటనలంటూ తనని తాను బజీ చేసుకుంది. ఇక ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తోంది. ఇప్పటికే ఆమె శాకుంతలంలో నటించగా, తమిళంలో విజయ్‌ సేతుపతితో  ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

చదవండి: ఈ చిన్నారి ఓ స్టార్‌ హీరోయిన్‌, మన అగ్ర హీరోలందరితో జతకట్టింది, ఎవరో గుర్తు పట్టారా?

ఇదిలా ఉంటే త్వరలో సామ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇవ్వబోతోందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు ప్రముఖ నటి తాప్సీ పన్ను నిర్మాణంలో సామ్‌ ఓ ప్రాజెక్ట్‌ చేయబోతుందని, దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ​సామ్‌ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు సమంత ‘మంచి స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తా. నాకు కూడా అక్కడ సినిమాలు చేయాలని ఆసక్తి ఉంది.

చదవండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్‌ హాసన్‌

నిజం చెప్పాలంటే ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేయలాంటే భాష అనేది సమస్య కాదు. కథలో జీవం ఉందా లేదా? ఆ కథకు నేను సెట్‌ అవుతానా? పాత్రకు న్యాయం చేయగలనా?.. ఏదైనా ప్రాజెక్ట్‌ ఓకే చేసే ముందు ఇలా నన్ను నేను ప్రశ్నించుకుంటాను’ అని సమంత సమాధానమిచ్చింది. కాగా ఇప్పటికే సామ్‌ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో సామ్‌ రాజీ అనే నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement