
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు తెలుగులో మాంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా ఆయనకు సూపర్ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇక రీసెంట్‌గా వారసుడు సినిమాతో తెలుగులో తొలిసారి ఎంట్రీ ఇచ్చారు విజయ్.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయనున్నారట విజయ్.
బాలకృష్ణతో ‘వీరసింహా రెడ్డి’ మూవీని డైరెక్ట్ చేసిన గోపీచంద్ మలినేనితో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవలె గోపీచంద్ మలినేని కథను వినిపించగా, విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment