Vijay Beast Arabic Kuthu Song Lyricist Details: గంటలో మిలియన్న్నర వ్యూస్.. అంతే రేంజ్లో లైక్స్. సినిమా వాళ్లంటే పడిచచ్చే తమిళ తంబీలు, విజయ్ ఫ్యాన్స్ హోల్‌సేల్‌గా బీస్ట్ ‘అరబిక్ కుతు’ సాంగ్ పాటకి ఫిదా అయిపోతున్నారు. చాలాకాలం గ్యాప్ తర్వాత విజయ్ స్టైలిష్ స్టెప్పులేయడంతో ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. బీస్ట్ సినిమా కోసం సాంగ్‌కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్, స్టైలిష్ స్టెప్పులు కంపోజ్ చేసిన జానీ మాస్టర్‌కు మాత్రమే కాదు.. పాట రాసిన హీరో శివకార్తికేయన్కే మేజర్ క్రెడిట్ ఇవ్వాలంటున్నారు విజయ్ అభిమానులు.
యస్.. టీవీ నటుడి నుంచి కష్టపడి నెమ్మది నెమ్మదిగా స్టార్ హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్. ఇండస్ట్రీలో ఇగో లేని హీరోగా అతనికి పేరుంది. అందుకే అతడంటే కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. మిగతా భాషల్లోనూ అతనికి అభిమానులు ఎక్కువే. ఈ క్రమంలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా.. గేయ రచయితగానూ తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంతకు ముందు కొలమావు కోకిల కోసం యోగిబాబు ‘కళ్యాణ వయసు’ సాంగ్, డాక్టర్ కోసం ‘చెల్లమ్మ, సో బేబీ’, సూర్య Etharkkum Thunindhavan కోసం ‘సుమ్మ సుర్రును’ లాంటి హిట్ సాంగ్స్ రాశాడు. ఇప్పుడు బీస్ట్ కోసం అరబిక్ టచ్‌తో అరబిక్ కుతు సాంగ్ అందించాడు.
నిజానికి ఈ పాట షార్ట్ టైంలో ఆకట్టుకోవడానికి, అంచనాలు పెంచుకోవడానికి కారణం.. శివకార్తికేయన్ ఇచ్చిన అరబిక్ టచ్. ఇందుకోసం తానేమీ అరబిక్‌ను అవపోసన, బట్టీ పట్టలేదని అంటున్నాడు శివకార్తికేయన్. తాజాగా ఓ మీడియా బైట్‌లో మాట్లాడుతూ.. జస్ట్.. అరబిక్ హమ్మింగ్ పదాలను సేకరించి.. వాటికి తమిళ పదాలు మేళవించి రాశానని చెప్పాడు. అలా అరబిక్ కుతుకు తన పని తేలికయ్యిందని అంటున్నాడు శివకార్తికేయన్. ఇక ఈ సాంగ్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సాంగ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ను సినీ గేయ రచయిత, దివంగత న ముత్తుకుమార్(ఎన్నో అర్థవంతమైన పాటల్ని రాసిన ముత్తుకుమార్.. 2016లో జాండిస్‌తో చనిపోయారు) కుటుంబానికి అందజేసి మంచి మనసు చాటుకున్నాడు నటుడు శివకార్తికేయన్. దీంతో సోషల్ మీడియాలో ఈ యంగ్ హీరోను తెగ పొగిడేస్తున్నారు.
కోలీవుడ్ సెన్సేషన్ నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్షన్లో రాబోతున్న బీస్ట్.. ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. జొనిత గాంధీతో కలిసి అనిరుధ్ పాడిన అరబిక్ కుతు సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి. సాంగ్ హిట్‌ను సంగతి కాసేపు పక్కనపెడితే.. తెలుగు మీమ్స్ పేజీలు ఈ సాంగ్ లిరిక్స్‌లోని పదాలతో ట్రోలింగ్ చేస్తూ నవ్వులు పంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment