హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం అయలాన్. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఆర్.రవికుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కొటపాటి జయం రాజేశ్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, నీరవ్‌షా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రామాన్ని చైన్నెలో నిర్వహించారు.
ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరింది
ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ.. తెలుగులో బాహుబలి, కన్నడంలో కేజీఎఫ్ చిత్రాల మాదిరి తమిళంలో అయలాన్ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రక్తంతో కూడిన హింసాత్మక సంఘటనలు గానీ, తుపాకీ శబ్దాలు గానీ, అశ్లీల సన్నివేశాలు గానీ ఉండవన్నారు. ఆబాలగోపాలం చూసి ఆనందించే విధంగా సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా అయలాన్ ఉంటుందన్నారు. అదే విధంగా ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని, ఈ చిత్రం కోసం తాను ఒక పాటను కూడా రాసినట్లు చెప్పారు.తనకు చిన్న తనం నుంచి కార్టూన్, గ్రాఫిక్స్ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు.
ఇతర సినిమాలతో పోల్చనుగానీ..
ఆ తరహాలో ఒక చిత్రాన్ని మనం చేయగలమా? అన్న ప్రశ్న ఎప్పుడూ తలెత్తేదన్నారు. దానికి సమాధానమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రం చేస్తే ఆ తరువాత మరిన్ని ఇలాంటి చిత్రాలు వస్తాయని భావించామన్నారు. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాతకు పలు సమస్యలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించడానికి తాను పారితోషికం కూడా వద్దు.. చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేయమని చెప్పానన్నారు. ఇతర చిత్రాలతో పోల్చను కానీ, అయలాన్ తమిళ చిత్రపరిశ్రమలో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు, టీజర్ కంటే ట్రైలర్ ఇంకా అదిరిపోతుందని శివకార్తికేయన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment