
మదుబాణకడై, వట్టం చిత్రాల ఫేమ్ కమల్ కన్నన్ తెరకెక్కించిన తాజా చిత్రం కొరంగు పెడల్. కాళీ వెంకట్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో సంతోష్ వేల్‌మురుగన్, వీఆర్.రాఘవన్, ఎం.జ్ఞానశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు రాశీ అళగప్పన్ రాసిన సైకిల్ అనే చిరు కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌జీ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్, సవిత కలిసి నిర్మించారు. జిబ్రాన్ సంగీతం, సునీల్ భాస్కర్ ఛాయాగ్రహణం అందించారు.
జీవితంలోని సంఘటనలు..
హీరో శివకార్తికేయన్‌కు చెందిన ఎస్‌కే.ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించడం విశేషం. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కురంగు పెడల్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాళీవెంకట్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదన్నారు. తన జీవితంలోని పలు సంఘటనలను ఈ చిత్రం గుర్తు చేసిందన్నారు. కురంగు పెడల్ చిత్రంలోని కురంగు అనే పాట గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం విశేషం అన్నారు.
కనెక్ట్ అయిపోయా
చిత్ర నిర్మాత సవితా మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను వినగానే తాను దీనికి కనెక్ట్ అయిపోయానన్నారు. సైకిల్ అనేది మన ఎదుగుదలలో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు చాలా స్వతంత్రాన్ని ఇచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు కమల్‌కన్నన్ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకుల్లోకి చేరడానికి ముఖ్య కారణం శివకార్తికేయన్. ఇందులో పని చేసిన వారంతా తమ సొంత చిత్రంగా భావించారని, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు.
We have had a fantastic response to the special screening of our #KuranguPedal. Book your tickets now and experience the nostalgic ride in theaters starting tomorrow. #KuranguPedalFromTomorrow
pic.twitter.com/TcD5vezHwz— Sivakarthikeyan Productions (@SKProdOffl) May 2, 2024