
‘హీరో’కు టైమ్ ఫిక్స్ చేశారు. నటుడు శివకార్తికేయన్‌కు అర్జెంట్‌గా ఒక హిట్ అవసరం. ఆయన ఇటీవల నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను అందుకోలేదు. ముఖ్యంగా ఇటీవల నయనతారతో కలిసి నటించిన మిస్టర్ లోకల్ చాలా నిరాశ పరిచింది. ఎంత స్టార్ వ్యాల్యూ ఉన్నా కథలో విషయం లేకపోతే ప్రేక్షకులు తిరష్కరిస్తారనడానికి ఈ చిత్రం ఒక నిదర్శనం. అయితే శివకార్తికేయన్ నిర్మాతగా హ్యాపీగానే ఉన్నాడు.
ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో హీరో ఒకటి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం విశాల్ కథానాయకుడిగా ఇరుంబుతిరై వంటి సంచలన విజయాన్ని సాధించిన చిత్ర దర్శకుడు మిత్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం హీరో. నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి కల్యాణి ప్రియదర్శన్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా తరువాత దుల్కర్‌సల్మాన్‌తో వాన్, శింబు సరసన మానాడు చిత్రాల్లో నటించడానికి ఓకె చెప్పారు కల్యాణీ. కాగా హీరో చిత్రంలో మరో నాయకిగా ఇవనా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, రోబోశంకర్, ప్రేమ్‌కుమార్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కేజీఆర్ స్టూడియోస్ కోట్టపాటి జే.రాజేశ్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా చిత్రకరణ దశలో ఉంది.
తాజాగా చిత్ర నిర్మాతలు హీరో చిత్ర విడుదల తేదీని వెల్లడించారు. చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. హీరో చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపారు. దీంతో నటుడు శివకార్తికేయన్ హీరో చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. దీని తరువాత పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో అనుఇమాన్యుల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment