
శివకార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఈయన మావీరన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయకగా పరిచయమైన విషయం తెలిసిందే. ఇది ఆమెకు రెండో చిత్రం.
కాగా 'మండేలా' చిత్రం ద్వారా పరిచయమైన మడోనా అశ్విన్ ఈ చిత్రానికి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్, నటి సరిత ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇదు అయాన్ సినిమాటోగ్రఫీ, భరత్ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. అయితే మావీరన్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన నిర్మాతల వర్గం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. అందులో తమ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొన్నారు. అసత్యాలు తాత్కాలికమేనని, నిజమే గెలుస్తుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
చదవండి: వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే
జమున చాలా పొగరుబోతు, ఇంట్లోకి కూడా రానివ్వదు
Comments
Please login to add a commentAdd a comment