
కౌసల్యాకృష్ణమూర్తి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘హీరో’. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘శక్తి.. ది సూపర్ హీరో’ పేరుతో విడుదల చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. యాక్షన్, ఎమోషన్, డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలతో సాగే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చదువు ప్రాముఖ్యత చెప్తూ, విద్య పేరుతో జరిగే వ్యాపారం నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
'చదువుతో వ్యాపారం చేసేవాడిని కాదు .. చదువుకున్న వాళ్లతో వ్యాపారం చేసేవాడిని'. 'స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే', ‘మన విద్యావిధానంలో అందరు చదువుకోవచ్చు కానీ అందరు సాధించలేరు. ఈ సిస్టమ్‌ను మార్చడానికి ఒక కామన్ మ్యాన్‌గా ఉండే సరిపోడు.. ఒక హీరో కావాలి’, ‘ఒక మనిషిని నాశనం చేయవచ్చు.. వాడి శిలా విగ్రహాన్ని నాశనం చేయవచ్చు.. కానీ వాడి ఐడియాలను, ఐడియాలజీస్‌ని ఎవడూ నాశనం చేయలేదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంఈ నెల 20న సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment