శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా కొత్త సినిమా షురూ అయింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఎస్‌కే 21’ (శివకార్తికేయన్) అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చెన్నైలో జరిగిన ఓ వేడుకలో ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘దేశభక్తి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది.
‘మేజర్’ లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన సోనీ పిక్చర్స్ మరోసారి దేశం గర్వించే వీరుల కథతో ‘ఎస్‌కే 21’ని నిర్మిస్తోంది. ఈ సినివ షూటింగ్ కాశ్మీర్‌లోని అద్భుతమైన లొకేషన్లలో శుక్రవారం ప్రారంభమైంది’’ అన్నారు.
జూలైలో మహావీరుడు... శివ కార్తికేయన్, అదితీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మహావీరుడు’. తమిళంలో ‘మహావీరన్’ పేరుతో రూపొందింది. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మింన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ త్రాన్ని జూలై 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటింంది.
Comments
Please login to add a commentAdd a comment