శివకార్తికేయన్‌తో శ్రుతీహాసన్ | Shruti approached for Sivakarthikeyan's next | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్‌తో శ్రుతీహాసన్

Published Wed, Nov 25 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM

శివకార్తికేయన్‌తో శ్రుతీహాసన్

శివకార్తికేయన్‌తో శ్రుతీహాసన్

ఈ మధ్య కోలీవుడ్‌లో యువ కథానాయకుల పంట పండుతోందనే చెప్పాలి. ఇంతకు ముందు ప్రముఖ కథానాయికలు యువ కథానాయకులతో నటించడానికి తటపటాయించే వాళ్లు. ఎక్కడ వారి ఇమేజ్ డామేజ్ అవుతుందోనని ఒకింత భయపడేవాళ్లు కూడా. అలాంటిది ఇప్పటి టాప్ నాయికలు నయనతార, హన్సిక, త్రిష, శ్రుతీహసన్ లాంటి వారు కుర్ర హీరోలతో నటించడానికి సై అనడంతో వాళ్లు యమ ఖుషీలో తేలిపోతున్నారనే చెప్పాలి.

ఆ మధ్య వర్ధమాన నటుడు ఆరితో మాయ చిత్రం, ఇటీవల నానుమ్ రౌడీదాన్ చిత్రంలో విజయ్‌వసంత్‌తో నటించడానికి స్టార్ నాయకి నయనతార ఏ మాత్రం వెనుకాడలేదు. అదే విధంగా హన్సిక శివకార్తికేయన్‌తో మాన్‌కరాటే చిత్రంలో నటించి ఆ చిత్రానికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇక మరో సంచలన నటి త్రిష నాయకి చిత్రంలో గణేశ్‌వెంకట్రామన్‌తో నటిస్తోంది.  

తాజాగా శివకార్తికేయన్ సరసన క్రేజీ బ్యూటీ శ్రుతీహసన్ నటించడానికి పచ్చజెండా ఊపడం విశేషం. వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంటున్న శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ విడుదలలో కొన్ని చిక్కులను ఎదుర్కొన్నా ప్రస్తుతం అవి తొలగి త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఆయన తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

పీసీ.శ్రీరామ్ ఛాయాగ్రహణ అందిస్తున్న ఇందులో శ్రుతీహాసన్ నటించే ప్రయత్నాలు జరిగాయి. దర్శకుడు కథ చెప్పగానే నచ్చేయడంతో శ్రుతీ హాసన్ వెంటనే నటించడానికి పచ్చజెండా ఊపినట్లు స మాచారం. కాగా ఈ బోల్డ్ అండ్ బ్యూటీ మరో పక్క సూర్య సరసన సింగం-3లో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement