కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'అయలాన్'. ఏలియన్స్ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఇందులో నటిస్తుంది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతికి తెలుగులో భారీగా సినిమాలు ఉన్నాయి.
దీంతో కొద్దిరోజుల క్రితం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఒక సమావేశం నిర్వహించారు. అన్నీ సినిమాలు ఒకేసారి రావడంతో థియేటర్ల కొరత ఏర్పడుతుందనే కారణంతో రవితేజ ఈగల్ సినిమాను వాయిదా వేశారు. ఈగల్ సినిమాకు పోటీ లేకుండా సింగల్ తేదీని ఇస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అందుకు ఈగల్ టీమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా సంక్రాంతి రేసులోకి శివ కార్తికేయన్ అయలాన్ చిత్రం వచ్చేసింది. జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్‌లో నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని. ఆయనతో పాటుగా సీడెడ్‌లో ఎన్.వీ ప్రసాద్, వెస్ట్ ఉషా పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటూ.. ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయా ఏరియాల్లో వీరందరూ కూడా చాలా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్స్‌గా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.
సంక్రాంతి రేసులో అయలాన్ చిత్రంతో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా ఉంది. థియటర్ల కొరతు ఉండటంతో ధనుష్ తెలుగులో వాయిదా వేసుకున్నాడు.. చివర్లో ఉనూహ్యంగా శివ కార్తికేయన్ రేసులోకి వచ్చేశాడు. ఇంతలా పోటీ పడతున్న ఈ చిత్రాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment