శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా నిర్మించారు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఫస్ట్ లుక్ విడుదల చేసింది యూనిట్.
(చదవండి: అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంక చోప్రా)
ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘అయలాన్’ అంటే ఏలియన్ అని అర్థం. ఇంతకుముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. అయితే, ఏలియన్ ప్రధాన పాత్ర నేపథ్యంలో దక్షిణాది భాషల్లో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు.. మా ‘అయలాన్’ తొలి చిత్రం అవుతుంది. ఈ చిత్రంలో 4500లకు పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇన్ని వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా మాదే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ సమయం పడుతోంది’’ అన్నారు. ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా, సంగీతం: ఏఆర్ రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment