
Sivakarthikeyan: కరోనా కారణంగా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా, జనాలు గడప దాటి అక్కడివరకు వస్తారన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. పైగా థియేటర్‌లో రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ఓటీటీ ట్రాక్ ఎక్కుతుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు ఆశగా చూస్తున్నారు. కొన్ని సినిమాలైతే నేరుగా ఓటీటీలో రిలీజై మంచి హిట్లు సాధించాయి.
అలా తాజాగా తమిళ చిత్రం డాక్టర్ కూడా ఓటీటీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హాట్‌స్టార్ మంచి రేటుకు తీసుకున్నట్లు సమాచారం. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా మెప్పించింది. ప్రస్తుతం శివకార్తికేయన్.. విజయ్ హీరోగా బీస్ట్ చిత్రం చేస్తున్నాడు.
చదవండి: Mandira Bedi: వీకెండ్‌లో భార్య, స్నేహితులతో రాజ్ కౌశల్ సందడి