∙రకుల్, శివ కార్తికేయన్
తమిళ చిత్రం‘అయలాన్’ తెలుగులో విడుదల కానుంది. శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అయలాన్’. కోటపాడి జె. రాజేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న తమిళ్‌లో విడుదలైంది. ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు గంగ ఎంటర్‌టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించింది.
‘‘ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘అయలాన్’. ఏలియన్ (గ్రహాంతర వాసి) ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి సినిమా మాదే. వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌కి సుమారు రెండేళ్లు పట్టింది. తమిళ్‌లో కేవలం నాలుగు రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చూపించాలని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కోటపాడి జె. రాజేశ్.
Comments
Please login to add a commentAdd a comment