రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా? | Rashmika Mandanna To Play Lead Role In Sivakarthikeyan, Sibi Chakravarthy Movie | Sakshi
Sakshi News home page

రష్మికకు మరో ఛాన్స్‌.. చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా?

Published Mon, May 20 2024 11:06 AM | Last Updated on Mon, May 20 2024 11:16 AM

Rashmika Mandanna To Play Lead Role In Sivakarthikeyan, Sibi Chakravarthy Movie

కన్నడలో కిరాక్‌ పార్టీ అనే చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించిన రష్మిక మందన్నా తర్వాత నేషనల్‌ క్రష్‌గా మారారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రముఖ నటుల సరసన నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తున్నారు. చేతినిండా చిత్రాలు ఉన్నా మరిన్ని అవకాశాలు ఈమె వైపే చూస్తుండడం విశేషం. 

రష్మిక చేతినిండా సినిమాలు..
ప్రస్తుతం పుష్ప 2, గర్ల్‌ ఫ్రెండ్‌, రెయిన్‌బో, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో చావ, సికిందర్‌ చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా తెలుగులోనూ విజయ్‌దేవరకొండతో మరోసారి కొత్త చిత్రంలో రొమా‌న్స్‌ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే తమిళంలో ఈమె నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ఇక్కడ ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్న రష్మిక మందన్నకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. 

కోలీవుడ్‌లో మరో ఛాన్స్‌
అలా త్వరలో సూర్యకు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమెను మరో అవకాశం వరించినట్లు తెలిసింది. శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించనున్న నూతన చిత్రంలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫిల్మీదునియాలో టాక్‌. శివ కార్తికేయన్‌ ప్రస్తుతం కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న అమరన్‌ చిత్రం పూర్తి చేసి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శివకార్తికేయన్‌ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో డాన్‌ ఒకటి. ఈ మూవీ ద్వారా సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యారు. 

శివకార్తికేయన్‌తో వన్స్‌మోర్‌
ఆ తర్వాత ఆయన రజనీకాంత్‌కు కథను సిద్ధం చేశారు. ఆ చిత్రంలో రజనీకాంత్‌ నటిస్తారని ప్రచారం జరిగినా, అది కార్య రూపం దాల్చలేదు. ఆ తర్వాత టాలీవుడ్‌ హీరో నానికి కథ చెప్పారు, అదీ వర్కౌట్‌ కాలేదు. దీంతో సిబి చక్రవర్తి తన తొలి చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్‌ తోనే మరో చిత్రం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రష్మికను భాగం చేయాలనుకుంటున్నారట!

చదవండి: 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'గా ఎన్టీఆర్‌ ఎలా ఎదిగాడు..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement