
కమల్ హాసన్ సంస్థతో కలిసి శివకార్తికేయన్ హీరోగా తమిళంలోనూ చిత్రాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని సోనీ సంస్థ నిర్వాహకుడు అన్నారు.
కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, సోనీ ఫిలిమ్స్ పిక్చర్స్ సంస్థ సంయుక్తంగా తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలు తొలి ప్రయత్నంగా శివకార్తికేయన్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. దీనికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను పొంగల్ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు.
అందులో సోనీ ఫిలిమ్స్ పిక్చర్స్ సంస్థతో కలిసి చిత్రం చేయడం గర్వంగా భావిస్తున్నట్లు కమల్ హాసన్‌తో పేర్కొన్నారు. కమల్ హాసన్ సంస్థతో కలిసి శివకార్తికేయన్ హీరోగా తమిళంలోనూ చిత్రాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని సోనీ సంస్థ నిర్వాహకుడు అన్నారు.