Sony Pictures
-
జీ-సోనీ డీల్ రద్దు.. రూ.748 కోట్లు కట్టాల్సిందే!
విలీన ఒప్పందాన్ని రద్దు చేసినందుకుగాను సోనీ పిక్చర్స్ నుంచి జీ ఎంటర్టైన్మెంట్ రూ.748 కోట్లు కోరుతుంది. ఈమేరకు జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.2021 డిసెంబర్ 22న జీ, సోనీ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2023 ఆగస్టు 10న ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం సోనీ గ్రూప్ సంస్థలైన కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్, బంగ్లా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్‌ఈఈఎల్)తో విలీనానికి ఆమోదం కూడా తెలిపింది. ఇది 10 బిలియన్ డాలర్ల విలువైన మీడియా సంస్థ ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే డీల్ కుదిరిన రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 22న విలీన ఒప్పందాన్ని సోనీ కార్పొరేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జెడ్‌ఈఈఎల్ విలీన షరతులను పాటించడం లేదని తెలిపింది.ఇన్వెస్టర్లను నమ్మించి చివరకు ఇలా డీల్‌కు రద్దు చేసుకోవడం పట్ల సోనీ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ) నుంచి 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.748.7 కోట్లు) టర్మినేషన్ ఫీజును జెడ్‌ఈఈఎల్ డిమాండ్ చేస్తుంది. -
బాలీవుడ్ ఎంట్రీ షురూ
వరుణ్ తేజ్ హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. శక్తి ప్రతాప్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తొలి తెలుగు–హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘనవిజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ రెనైసెన్స్ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలి సీన్‌కి వరుణ్ తేజ్ తల్లి పద్మజ కొణిదెల కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. నిర్మాత బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఇందులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా జర్నీలో భాగమైనందుకు హ్యాపీ’’ అన్నారు నిర్మాత సందీప్ ముద్దా. ‘‘దేశం గర్వించదగ్గ నిజమైన హీరోల కథలను చెప్పనున్నాం. నవంబర్‌లో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు ఇండియా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్ లాడా గురుదేన్ సింగ్. -
'శక్తిమాన్'గా రానున్న ఆ స్టార్ హీరో ?
Ranveer Singh As Shaktiman: శక్తిమాన్.. ఈ టీవీ షో అంటే 1990 కిడ్స్‌కు అమితమైన అభిమానం. ఇప్పుడంటే మార్వెల్, డిస్నీ వంటి హాలీవుడ్ సూపర్ హీలోలు ఉన్నారు కానీ, అప్పట్లోనే ఇండియన్ సూపర్ హీరోగా వెలుగొందాడు ఈ శక్తిమాన్. ఈ శక్తిమాన్ పాత్రలో ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సుమారు 29 ఏళ్ల తర్వాత ఈ టీవీ షో సినిమాగా రానుంది. దీనికి సంబంధించిన హక్కుల్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాంగా తెరకెక్కించేందుకు 'భీష్మ్ ఇంటర్నేషనల్'తో కలిసి సోనీ పిక్చర్స్ నిర్మించనుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ హీరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర చేసేందుకు రణ్వీర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శక్తిమాన్‌గా రణ్వీర్ నటిస్తే ఆ పాత్రకు ఒక ప్రత్యేకత వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 'శక్తిమాన్' రీమేక్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి: బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. తనకన్నా చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, ఇద్దరు పుట్టాక పెళ్లి ! -
రష్యాకు భారీ షాక్ ఇచ్చిన మరో కంపెనీ..!
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో సైనికుల ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ దాడులను ఆపేందుకు అనేక యూరోప్ దేశాలతో పాటు దిగ్గజ కంపెనీలు కూడ రష్యా మీద అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కూడా రష్యాలో తన వ్యాపార కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసినట్లు ప్రకటించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ఛైర్మన్, సీఈఓ టోనీ విన్సిక్వెరా ఈ విషయం గురించి సిబ్బందికి తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ పంపారు. రష్యాలో సోనీకి చెందిన క్రంచీరోల్ యానిమ్ స్ట్రీమింగ్ సేవలను నిలిపి వేయడంతో పాటు టీవీలతో చేసుకున్న పంపిణీ ఒప్పందాలు కూడా నిలివేసింది "రెండు వారాల క్రితం, మేము రష్యాలో విడుదల చేయాలనికున్న మోర్బియస్ అనే చిత్రాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి మేము స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, ఇతర టెలివిజన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను కూడా నిలిపిచేసాము. ఈ ఉదయం, క్రంచీరోల్ రష్యాలో యానిమ్ స్ట్రీమింగ్ సేవలను నిలిపివేసింది" అని విన్సీక్వెరా ఈ-మెయిల్లో పేర్కొన్నారు. గత వారం సోనీ గ్రూప్ ఉక్రెయిన్ ప్రజలకు మానవతా సహాయం అందించడానికి ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్(యుఎన్‌హెచ్‌సీఆర్), అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్'కు $2 మిలియన్ (సుమారు రూ.15 కోట్ల) విరాళాన్ని ప్రకటించింది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలో దేశంలోకి.. ధరెంతో తెలుసా?) -
కమల్ హాసన్‌తో సోనీ సంస్థ ఒప్పందం
కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, సోనీ ఫిలిమ్స్ పిక్చర్స్ సంస్థ సంయుక్తంగా తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలు తొలి ప్రయత్నంగా శివకార్తికేయన్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. దీనికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను పొంగల్ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. అందులో సోనీ ఫిలిమ్స్ పిక్చర్స్ సంస్థతో కలిసి చిత్రం చేయడం గర్వంగా భావిస్తున్నట్లు కమల్ హాసన్‌తో పేర్కొన్నారు. కమల్ హాసన్ సంస్థతో కలిసి శివకార్తికేయన్ హీరోగా తమిళంలోనూ చిత్రాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని సోనీ సంస్థ నిర్వాహకుడు అన్నారు. -
సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం !
-
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మెగా హీరో!
సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లకు బాలీవుడ్ అంటె కొంచెం క్రేజ్ ఎక్కువ. అందుకే తమ ఇండస్ట్రీలో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్తుంటారు. అందుకు టాలీవుడ్ పరిశ్రమ కూడా అతీతం కాదు. మన స్టార్ హీరోల్లో చాలామంది బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మరికొంతమంది హిందీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చేరాడు. మెగా హీరోలంతా మాస్ సినిమాలు చేస్తుంటే.. వరుణ్ మాత్రం అందుకు కాస్త భిన్నంగా వెళ్తున్నాడు. ఒక జానర్‌కు పరిమితం కాకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు వరుణ్. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నాడట వరుణ్. సోనీ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో వరుణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను తెలుగు హిందీలో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా హీరో.. బాలీవుడ్లో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. -
ఫిబ్రవరి 5న ‘మాన్స్టర్ హంటర్’
మిలా జొవోవిచ్, టోనీ జా ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘మాన్స్టర్ హంటర్’. పాల్ డబ్ల్యూఎస్ అండర్సన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగులో ఫిబ్రవరి 5న విడుదల చేస్తున్నట్లు పంపిణీదారులు సోనీ పిక్చర్స్ తెలిపింది. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణాని మాట్లాడుతూ– ‘‘విజువల్ వండర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. ప్రఖ్యాత వీడియో గేమ్ ‘మాన్స్టర్ హంటర్’ ఆధారంగా ఈ సినిమాను అదే పేరుతో రూపొందించారు క్లిఫోర్డ్ టీఐ హ్యారిస్. అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన మాన్‌స్టర్స్‌ను ఎదుర్కొనేందుకు ఇద్దరు వీరులు చేసిన పోరాటమే ఈ చిత్రకథ. ఇలాంటి చిత్రాలను తెరపైనే చూడాలి. త్రీడీ సాంకేతికత ప్రేక్షకులకు మరింత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మా ఎగ్జిబిటర్స్ థియేటర్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇండియా అంతటా ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది’’అన్నారు. జూనియర్ మీగాన్ గుడ్, డియాగో బోనెట, జోష్ హెల్ మ్యాన్, జిన్ ఉ యూంగ్ మెక్ జిన్, రాన్ పెర్ల్ మ్యాన్ ఇతర పాత్రల్లో నటించారు. -
మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ హీరోగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాక నిర్మాతగానూ మంచి ఫాం చూపిస్తున్నాడు. ఇన్నాళ్లు తన చిత్రాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన మహేష్, ఇప్పుడు ఇతర హీరోలతో, ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టి చార్లీ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నట్టుగా తెలిపాడు. తాజాగా మరో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు సూపర్ స్టార్. క్షణం, గూఢచారి లాంటి సూపర్ హిట్ సినిమాలతో అలరించిన అడవి శేష్ హీరోగా ఓ బయోగ్రాఫికల్ మూవీని నిర్మిస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో బాలీవుడ్ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తెలుగులోకి అడుగుపెట్టబోతోంది. అంతేకాదు ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందనుండటంతో ఈ సినిమాలో మహేష్ నిర్మాతగా బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు. మేజర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ 26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మరోసారి అడవి శేష్ కథా కథనాలు అందిస్తున్న ఈ సినిమాకు గూఢచారి ఫేం శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్, జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఒక ప్రకటన విడుదల చేశారు. అడివి ఎంటర్టైన్మెంట్స్, శరత్ చంద్ర, ఏ+ఎస్ మూవీస్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈసినిమా షూటింగ్ 2019 వేసవిలో ప్రారభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2020లో సినిమా విడుదలకానుంది. Honoured to bring you the story of our National hero - Major Sandeep Unnikrishnan... Sending my best wishes to @AdiviSesh, director @sashikirantikka, team @GMBents, @AplusSMovies... & Congratulations @SonyPicsIndia on your debut Telugu production👍🏻#MajorTheFilm pic.twitter.com/BZf4gSE1Rn — Mahesh Babu (@urstrulyMahesh) 27 February 2019 -
ట్రైలర్‌కు బదులుగా ఫుల్ మూవీ అప్లోడ్..
సాధారణంగా సినిమా విడుదలకు ముందు ట్రైలర్లు, టీజర్లు లాంటివి ప్రమోట్ చేయడం చూస్తుంటాం. అయితే సోని పిక్చర్స్ వారు చేసిన పనికి ఏకంగా నెటిజన్లు మొత్తం సినిమానే హాయిగా వీక్షించారు. రెడ్ బ్యాండ్ మూవీ ట్రైలర్ లింక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉండగా.. జాన్ మథ్యూస్ దర్శకత్వం వహించిన ‘ఖాళీ ద కిల్లర్’ మూవీ లింక్‌ను సోని సంస్థ పొరపాటున షేర్ చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటర్నెట్లో మూవీని చూసిన ఉత్సాహంలో కొందరు సోనీ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇది గమనించిన నెటిజన్లు ఎంచక్కా మూవీని డౌన్లోడ్ చేసుకుని చూశారు. హాలీవుడ్ రిపోర్టర్ అయితే 89 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న మూవీని సోని పిక్చర్స్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు వెల్లడించారు. దాదాపు 8 గంటలపాటు మూవీ ఆన్లైన్లో ఉండగా, కొందరు నెటిజన్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ‘హహహ.. సోని సంస్థ ఖాళీ ద కిల్లర్ మూవీ ట్రైలర్‌ను అప్లోడ్ చేయాలనుకుంది. అయితే పొరపాటున మూవీ లింక్‌ను పోస్ట్ చేసింది. హహహ నేను ఆ మూవీ మొత్తం చూశాను’ అని రాకో బాట్టే అనే ట్విటర్ ఫాలోయర్ అందుకు సంబంధించిన ఫొటోను తన పోస్ట్‌లో షేర్ చేశారు. Hahahahahah Sony tried to put up a new trailer for “Khali The Killer” but accidentally uploaded the entire movie hahahahahahahaha im watchin it pic.twitter.com/IA2mOfElIQ — Rocco Botte (@rocco_botte) 3 July 2018 -
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్
జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన టెన్ స్పోర్ట్స్ ను సోనీ పిక్చర్స్ సొంతంచేసుకుంది. రూ.2600 కోట్లకు స్పోర్ట్ బ్రాండ్కాస్టింగ్ బిజినెస్‌లను సోనీ పిక్చర్స్‌కు విక్రయించేందుకు టెలివిజన్ దిగ్గజం సుభాష్ చంద్ర ఆధ్వర్యంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఆమోదించింది. సోనీతో కుదుర్చుకున్న ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుంది. 2006లో దుబాయ్ టాటా గ్రూపునకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ నుంచి టెన్ స్పోర్ట్స్‌ను సుభాష చంద్ర కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీన్ని సోనీ పిక్చర్స్‌కు విక్రయించారు. మరో నాలుగు, ఐదు నెలల్లో ఈ డీల్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ డీల్‌తో 21వ సెంచరీ ఫాక్స్ సొంతమైన స్టార్ ఇండియా, జపనీస్ దిగ్గజం సోనీ కార్ప్ సొంతమైన సోనీ పిక్చర్స్ భారత్‌లో స్పోర్ట్స్ ప్రసార విభాగాల్లో ఏకాధిపత్యం సాధించినట్టేనని వెల్లడవుతోంది. గత కొంతకాలంగా టెన్ స్పోర్ట్స్‌ను విక్రయించాలని జీ ఎంటర్టైన్మెంట్ పావులు కదిపిందని, నష్టాల్లో కొనసాగుతున్న స్పోర్ట్స్ వ్యాపారాలను వదిలించుకోవడానికి ప్రయత్నించిందని జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన ఓ అధికారి తెలిపారు. సోనీ, స్టార్ రెండు భారత్‌లో తిరుగులేని ఛానల్స్ అని, ఈ డీల్ సోనీకి ఎంతో సహకరించనుందని డఫ్, ఫిల్స్స్ వాల్యుయేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ గుప్తా తెలిపారు. ఈ డీల్ అటు జీ ఎంటర్టైన్మెంట్కి, ఇటు సోనీకి లబ్ది చేకూరుస్తుందని స్పోర్ట్స్ బ్రాండ్కాస్టింగ్కు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ భాషల్లో అనేక చానల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాల్లో తనదైన హవాను చాటుకుంటూ సోనీ కోట్ల రూపాయల ఆదాయాలను ఆర్జిస్తోంది. -
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్?
ముంబై: సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా త్వరలో జీ టీవికి చెందిన టెన్ స్పోర్ట్స్ ను సొంతం చేసుకోనుంది. టెలివిజన్ మొఘల్ సుభాస్ చంద్ర ఆధ్వర్యంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెఇఈల్)కు చెందిన టెన్ స్పోర్ట్స్ ను సోనీ స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. దాదాపు రూ.2000కోట్ల రూపాయలకుసోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా దీన్ని కొనుగోలు చేయనున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2006లో దుబాయ్ టాటా గ్రూపునకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ నుంచి దీన్ని సుభాష చంద్ర కొనుగోలు చేశారు. రెండు నెలలక్రితం ప్రారంభమైన చర్చలు, రెండు వారాల క్రితం మరింత వేగమయ్యాయని దీంతో ఇది ఒక కొలిక్కి వచ్చాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మరో రెండు మూడువారాల్లో దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై సోనీ ప్రతినిధిని సంప్రదించగా స్పందించడానికి నిరాకరించారు. ఇది పాలసీకి సంబంధించిన అంశమంటూ ఊహాగానాలపై వివరించాడానికి వ్యతిరేకించారు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మిహిర్ మోడీ. కాగా మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ భాషల్లో అనేక చానల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాల్లో తనదైన హవాను చాటుకుంటూ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ఈ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే 21 వ సెంచరీ ఫాక్స్ సొంతమైన స్టార్ ఇండియా, జపనీస్ దిగ్గజం సోనీ కార్ప్ సొంతమైన సోనీ పిక్చర్స్ భారతదేశంలో స్పోర్ట్స్ ప్రసార విభాగాల్లో ఏకాధిపత్యం సాధించినట్టేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
సోనికి ఐపీఎల్9 ఆదాయం రూ.1,200 కోట్లు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 9వ సీజన్లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్(ఎస్పీఎన్) ఇండియా కంపెనీ రూ.1,200 కోట్ల ప్రకటనల ఆదాయం ఆర్జించింది. గతేడాది ఆదాయం(రూ.1,000 కోట్లు)తో పోల్చితే 20% వృద్ధి చెందింది. ప్రకటనల రేట్లు 15% పెరగడం వల్ల ఈ స్థాయి ఆదాయం సాధించామని ఎస్పీఎన్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా చెప్పారు.