గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో సైనికుల ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ దాడులను ఆపేందుకు అనేక యూరోప్ దేశాలతో పాటు దిగ్గజ కంపెనీలు కూడ రష్యా మీద అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కూడా రష్యాలో తన వ్యాపార కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసినట్లు ప్రకటించింది.
సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ఛైర్మన్, సీఈఓ టోనీ విన్సిక్వెరా ఈ విషయం గురించి సిబ్బందికి తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ పంపారు. రష్యాలో సోనీకి చెందిన క్రంచీరోల్ యానిమ్ స్ట్రీమింగ్ సేవలను నిలిపి వేయడంతో పాటు టీవీలతో చేసుకున్న పంపిణీ ఒప్పందాలు కూడా నిలివేసింది "రెండు వారాల క్రితం, మేము రష్యాలో విడుదల చేయాలనికున్న మోర్బియస్ అనే చిత్రాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
అప్పటి నుంచి మేము స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, ఇతర టెలివిజన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను కూడా నిలిపిచేసాము. ఈ ఉదయం, క్రంచీరోల్ రష్యాలో యానిమ్ స్ట్రీమింగ్ సేవలను నిలిపివేసింది" అని విన్సీక్వెరా ఈ-మెయిల్లో పేర్కొన్నారు. గత వారం సోనీ గ్రూప్ ఉక్రెయిన్ ప్రజలకు మానవతా సహాయం అందించడానికి ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్(యుఎన్‌హెచ్‌సీఆర్), అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్'కు $2 మిలియన్ (సుమారు రూ.15 కోట్ల) విరాళాన్ని ప్రకటించింది.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలో దేశంలోకి.. ధరెంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment