'శక్తిమాన్‌'గా రానున్న ఆ స్టార్‌ హీరో ? | Ranveer Singh To Play Mukesh Khanna Iconic Role Shaktiman | Sakshi
Sakshi News home page

సుమారు 29 ఏళ్ల తర్వాత 'శక్తిమాన్‌'.. సూపర్‌ హీరోగా స్టార్‌ హీరో ?

Published Sat, Jul 9 2022 9:18 PM | Last Updated on Sat, Jul 9 2022 9:30 PM

Ranveer Singh To Play Mukesh Khanna Iconic Role Shaktiman - Sakshi

Ranveer Singh As Shaktiman: శక్తిమాన్‌.. ఈ టీవీ షో అంటే 1990 కిడ్స్‌కు అమితమైన అభిమానం. ఇప్పుడంటే మార్వెల్‌, డిస్నీ వంటి హాలీవుడ్‌ సూపర్‌ హీలోలు ఉన్నారు కానీ, అప్పట్లోనే ఇండియన్ సూపర్‌ హీరోగా వెలుగొందాడు ఈ శక్తిమాన్. ఈ శక్తిమాన్ పాత్రలో ప్రముఖ నటుడు ముఖేష్‌ ఖన్నా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సుమారు 29 ఏళ్ల తర్వాత ఈ టీవీ షో సినిమాగా రానుంది. దీనికి సంబంధించిన హక్కుల్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌ చిత్రాంగా తెరకెక్కించేందుకు 'భీష్మ్ ఇంటర్నేషనల్‌'తో కలిసి సోనీ పిక్చర్స్‌ నిర్మించనుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ హీరో పాత్ర కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర చేసేందుకు రణ్‌వీర్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శక్తిమాన్‌గా రణ్‌వీర్‌ నటిస్తే ఆ పాత్రకు ఒక ప్రత్యేకత వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 'శక్తిమాన్‌' రీమేక్‌ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

చదవండి: బేబీ బంప్‌తో అలియా భట్‌ !.. లీకైన ఫొటోలు..
తనకన్నా చిన్నవాడితో హీరోయిన్‌ డేటింగ్‌, ఇద్దరు పుట్టాక పెళ్లి !


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement