Shaktiman
-
స్పీడ్‌గా వెళ్తున్న ట్రక్కుపై 'శక్తిమాన్' స్టైల్లో ఫీట్లు.. పట్టుతప్పటంతో..!
లక్నో: రోడ్డుపై వేగంగా వెళ్తున్న చెత్త తీసుకెళ్లే ట్రక్కుపై ఓ వ్యక్తి పుషప్స్ చేస్తూ సూపర్ హీరోలా రెచ్చిపోయాడు. ట్రక్కుపై ఎలాంటి ఆధారంలేకుండా నిలబడి పోజులిచ్చాడు. కొద్ది సేపటికే పట్టు కోల్పోయి.. కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో కుయ్యో ముర్రో అంటూ మూలుగుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు సీనియర్ పోలీస్ అధికారి శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్‌లా కాదు.. బుద్ధిమాన్‌లా ఉండు అంటూ ట్యాగ్ జత చేశారు. ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ట్రక్కుపై నుంచి కిందపడిపోవటం వల్ల ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భుజాలు, కాళ్లు, వీపుపై గాయాలతో బెడ్‌పై పడుకున్న దృశ్యాలు సైతం ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य- बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान! चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ — Shweta Srivastava (@CopShweta) July 17, 2022 'అతడు శక్తిమాన్‌లా మారేందుకు ప్రయత్నించాడు. కానీ, బొక్కబోర్లాపడి కనీసం కూర్చోలేకపోతున్నాడు. దయచేసి అలాంటి ప్రమాదకర స్టంట్లు చేయవద్దు.' అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు అదనపు డిప్యూటీ కమిషనర్ శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్ సూపర్ హిట్ సూపర్ హీరో టీవీ షో. అది 1997 నుంచి 2005 వరకు డీడీ నేషనల్ ఛానల్లో ప్రసారమైంది. శక్తిమాన్‌గా ముకేశ్ ఖన్నా అభిమానులను మెప్పించారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా! -
'శక్తిమాన్'గా రానున్న ఆ స్టార్ హీరో ?
Ranveer Singh As Shaktiman: శక్తిమాన్.. ఈ టీవీ షో అంటే 1990 కిడ్స్‌కు అమితమైన అభిమానం. ఇప్పుడంటే మార్వెల్, డిస్నీ వంటి హాలీవుడ్ సూపర్ హీలోలు ఉన్నారు కానీ, అప్పట్లోనే ఇండియన్ సూపర్ హీరోగా వెలుగొందాడు ఈ శక్తిమాన్. ఈ శక్తిమాన్ పాత్రలో ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సుమారు 29 ఏళ్ల తర్వాత ఈ టీవీ షో సినిమాగా రానుంది. దీనికి సంబంధించిన హక్కుల్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాంగా తెరకెక్కించేందుకు 'భీష్మ్ ఇంటర్నేషనల్'తో కలిసి సోనీ పిక్చర్స్ నిర్మించనుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ హీరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర చేసేందుకు రణ్వీర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శక్తిమాన్‌గా రణ్వీర్ నటిస్తే ఆ పాత్రకు ఒక ప్రత్యేకత వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 'శక్తిమాన్' రీమేక్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి: బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. తనకన్నా చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, ఇద్దరు పుట్టాక పెళ్లి ! -
డీడీ నంబర్ వన్
కేబుల్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్ టీవీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ‘డీడీ నేషనల్’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్. పీ రేటింగ్స్ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లాక్ డౌన్ కి ముందు వారాల్లో టాప్ 10లో లేకపోయినా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్ సంఖ్యతో పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్ 3) దూరదర్శన్ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్ బక్షి వంటి పాపులర్ సీరియళ్లు, ప్రోగ్రాములు తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్ సంస్థ తెలిపింది. -
దోషిగా తేలితే నా కాలు నరుక్కుంటా!!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పోలీసు గుర్రం శక్తిమాన్ మృతిపై జంతు ప్రేమికులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర సంతాపం వ్యక్తమవుతున్నది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ బుధవారం శక్తిమాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శక్తిమాన్ మృతి తీవ్ర విషాదకరమని, ఈ విషాదంపై స్పందించడానికి నోట మాట రావడం లేదని రావత్ అన్నారు. శక్తిమాన్ చక్కగా కోలుకుంటున్నదని తాము భావించామని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం ఖూనీ చేసిన తరహాలోనే బీజేపీ ఎమ్మెల్యే దాడితో పోలీసు గుర్రం చనిపోవాల్సి రావడం బాధాకరమని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు! బీజేపీ ఆందోళనలో గాయపడిన శక్తిమాన్ చక్కగా కోలుకుంటున్నదని, అది చనిపోతుందని తాము భావించలేదని, ఇది చాలా బాధాకరమని ఆ గుర్రానికి చికిత్స అందించిన వైద్యుడు ఖంబాటా తెలిపారు. మూడు కాళ్లతో గుర్రం బతకడం కష్టమని, అందుకే అది తుదిశ్వాస విడిచిందని, ఇకనైనా జంతు పరిరక్షణ చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని జంతు హక్కుల కార్యకర్త, పెటా ప్రతినిధి భువనేశ్వరీ అన్నారు. నా కాలు నరుక్కుంటా! శక్తిమాన్ మృతిపై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి విచారం వ్యక్తం చేశారు. తాను ఆ గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల ఆ గుర్రం గాయపడలేదని ఆయన మరోసారి పేర్కొన్నారు. తాను గుర్రం కాలు విరగగొట్టినట్టు రుజువు చేస్తే.. అందుకు బదులుగా తన కాలును నరుక్కుంటానని గణేష్ జోషి పునరుద్ఘాటించారు. బీజేపీ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడం వల్లే ఈ గుర్రం గాయపడిందని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
పాపం.. ఆ శక్తిమాన్ ఇక లేదు!
శక్తిమాన్ గుర్తుంది కదా.. బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చేతిలో దారుణంగా దెబ్బలు తిని.. ఆ మధ్య దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన ఈ ఉత్తరాఖండ్ పోలీసు గుర్రం ఇక లేదు. గత నెల హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన ఆందోళనలో తీవ్రంగా గాయపడిన ఈ 14 ఏళ్ల గుర్రం ఓ కాలిని వైద్యులు శస్త్రచికిత్స జరిపి తొలగించారు. ఆ కాలి స్థానంలో కృత్రిమ కాలును అమర్చి.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇన్నాళ్లు ప్రాణాలతో పోరాడిన శక్తిమాన్ బుధవారం తుదిశ్వాస విడిచింది. గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ గుర్రం చనిపోవడానికి కారణమని బీజేపీ ఆరోపిస్తున్నది. బీజేపీ ఆందోళనలో గాయపడిన కారణంగా ఈ గుర్రానికి సరైన వైద్యం అందించకుండా చనిపోయేలా హరీశ్ రావత్ ప్రభుత్వం చేసిందని కమలం నేత అజయ్ భట్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ అశ్వ పోలీసు దళంలో శక్తిమాన్ సేవలందించింది. మార్చి 14న డెహ్రాడూన్‌లో బీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా శక్తిమాన్ గాయపడింది. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడం వల్లే ఈ గుర్రం గాయపడిందని పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేశారు. గణేశ్ జోషి గుర్రాన్ని కొడుతున్నట్టు వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆయన మాత్రం తాను గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల అది గాయపడలేదని వాదిస్తున్నారు. -
హమ్మయ్య... నిలబడుతోంది!
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో బీజేపీ ఎమ్మెల్యే దాడిలో గాయపడిన పోలీసు గుర్రం 'శక్తిమాన్' కోలుకుంటోంది. కృత్రిమంగా అమర్చిన కాలుతో నిలబడగలుగుతోందని 'శక్తిమాన్'కు చికిత్స చేస్తున్న డాక్టర్ రాకేశ్ నాటియాల్ తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండానే నిలబడగలగుతోందని చెప్పారు. అంతకుముందుతో పోలిస్తే 'శక్తిమాన్' ఆరోగ్య పరిస్థితిలో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపిస్తోందన్నారు. కొన్ని రోజుల్లో నడవగలుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డెహ్రడూన్ లో ఇటీవల ప్రతిపక్షాల ఆందోళన సందర్భంగా బీజేపీ నేతలు జరిపిన దాడిలో ఈ తెల్ల గుర్రం తీవ్రంగా గాయపడింది. దీంతో దాని వెనుకకాలిని తొలగించి, కృత్రిమకాలు అమర్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆ గుర్రానికి కాలొచ్చింది!
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో బీజేపీ నిరసన సందర్భంగా తీవ్రంగా గాయపడిన శక్తిమాన్ అనే గుర్రానికి కృత్రిమ కాలు అమర్చారు. ఇందుకోసం జరిగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. గుర్రం లేచి తన కొత్త కాలుమీద నిలబడిందని, దాంతో ఆపరేషన్ విజయవంతం అయినట్లేనని దానికి ఆపేరషన్ చేసిన డాక్టర్ ఖంబాటా తెలిపారు. గుర్రం కాలు తీవ్రంగా గాయపడటం, దాన్ని అలాగే ఉంచేస్తే గాంగరిన్ కారణంగా అది చనిపోయే ప్రమాదం ఉండటంతో కాలును అంతకుముందు తీసేశారు. గుర్రాన్ని పదేపదే కర్రతో కొట్టారని ఆరోపణలు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాన్ని సందర్శించారు. అయితే తాను అసలు దాన్ని కొట్టనే లేదని, మూగజీవి బాధపడుతోందన్న ఆవేదనతోనే ఇక్కడకు వచ్చానని ఆయన చెప్పారు. వాస్తవానికి గుర్రం తీవ్రంగా గాయపడిన దృశ్యాల్లో ఎమ్మెల్యే జోషి కర్రతో ఉన్నట్లు కనిపించినా, ఆయన దాన్ని కొట్టిన దృశ్యాలు మాత్రం ఎక్కడా లేవు. మరో వ్యక్తి మాత్రం శక్తిమాన్ మీద పోలీసు స్వారీ చేస్తుండగా దాని కళ్లెం పట్టుకుని లాగేశాడు. దాంతో అది కింద పడిపోయింది. సదరు వ్యక్తిని వీడియో ఫుటేజిలో గుర్తించి, అరెస్టు చేశారు. గడిచిన మూడు రోజులుగా గుర్రాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సహా పలువురు నాయకులు పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న గుర్రం గాయపడినందుకు తాను ఎంతో బాధపడుతున్నానని, ఇది ఒక క్షతగాత్రుడైన సైనికుడితో సమానమని ఆయన అన్నారు. -
'శక్తిమాన్'కు బీజేపీ నేతల పరామర్శ
డెహ్రడూన్: బీజేపీ నేతల దాడిలో గాయపడిన పోలీసు గుర్రం 'శక్తిమాన్'కు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ మూగజీవం నాలుగు కాళ్లపై నిలబడలేకపోతోందని వైద్యులు తెలిపారు. అమెరికా డాక్టర్ తో పాటు ముంబై నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు దీనికి చికిత్స అందిస్తున్నారు. 14 ఏళ్ల ఈ శ్వేత అశ్వం పదేళ్లుగా పోలీసు బెటాలియన్ కు సేవలందిస్తూ పలు పతకాలు సాధించింది. ఎమ్మెల్యే గణేశ్ జోషి సహా పలువురు బీజేపీ నేతలు గురువారం 'శక్తిమాన్'పై దగ్గరకు వచ్చారు. వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించారు. గుర్రంపై దాడి కేసులో గణేశ్ జోషి ప్రధాన నిందితుడుగా ఉన్నారు. తాను మానవత్వంతో ఇక్కడికి వచ్చానని, గుర్రాన్ని కొట్టలేదని అన్నారు. మూగజీవం గాయపడడం తనను బాధించిందని తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం బీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా 'శక్తిమాన్'పై కాషాయ నేతలు విచక్షణారహతంగా దాడి చేశారు. ఈ కేసులో ప్రమోద్ బొరా అనే బీజేపీ కార్యకర్తను హల్ద్ వానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డెహ్రడూన్ ఎస్ఎస్పీ సదానంద డేట్ తెలిపారు.