
లోకనాయకుడు కమల్ హాసన్ నటుడిగా, నిర్మాతగా చాలా బిజీగా ఉన్నారు. ఈయన శంకర్ దర్శకత్వంలో నటించిన ఇండియన్–2 జులై 12వ తేదీన తెరపైకి రానుంది. అలాగే తెలుగులో ప్రభాస్ కథానాయకుడుగా నటించిన కల్కి చిత్రంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. ఇది ప్రతినాయకుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రం వచ్చే నెలలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో థగ్‌లైఫ్ చిత్రంలో కమల్ నటిస్తున్నారు. మరో పక్క నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. అందులో ఒకటి అమరన్. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఇందులో సాయిపల్లవి హీరోయిన్. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
శివకార్తికేయన్ ముకుందన్ అనే సైనికుడిగా పవర్‌ఫుల్ పాత్ర పోషించిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లో జరుపుకుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అమరన్ సెప్టెంబర్ 27న తెరపైకి రానుంది.
చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment