ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Aa Okkati Adakku OTT Streaming Now On This OTT | Sakshi
Sakshi News home page

Aa Okkati Adakku OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతున్న 'ఆ ఒక్కటి అడక్కు'

May 31 2024 7:40 AM | Updated on May 31 2024 9:06 AM

Aa Okkati Adakku OTT Streaming Now On This OTT

శుక‍్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని చూస్తుంటాం. అయితే ఈ వారం థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయువేగం మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం మరి అంత కాకపోయినా కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు-వెబ్ సిరీసులు అయితే వచ్చేశాయి. వీటిలో కొన్ని ముందే ప్రకటించారు. ఓ తెలుగు మూవీ మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేశారు.

(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విట్టర్ రివ్యూ)

అల్లరి నరేశ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ గత కొన్నేళ్ల నుంచి సీరియస్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన బలమైన కామెడీ కథతో తీసిన మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కానీ కుర్రాడిగా అల్లరి నరేశ్ నటించాడు. మే 3న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. మరీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ ఓ మాదిరి వసూళ్లు సాధించింది.

ఇప్పుడు నెల కూడా తిరక్కుండానే ఎలాండి హడావుడి లేకుండా 'ఆ ఒక్కటి అడక్కు' స్ట్రీమింగ్ అయిపోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉంది. వీకెండ్ టైమ్ పాస్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఈ మూవీ ఎంటర్‌టైన్ చేస్తుంది. మరి ఇంకెందుకు లేటు. టైమ్ చూసుకుని 'ఆ ఒక్కటి అడక్కు' చూసేయండి.

(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement