కోలీవుడ్‌ హీరోతో కుర్చీ మడతపెట్టిన శ్రీలీల | Sivakarthikeyan Dance With Sreeleela For Kurchi Madathapetti Song | Sakshi
Sakshi News home page

హీరోతో కుర్చీమడతపెట్టి పాటకు చిందేసిన శ్రీలీల.. వీడియో వైరల్‌

Published Mon, Mar 25 2024 11:35 AM | Last Updated on Mon, Mar 25 2024 11:57 AM

Sivakarthikeyan Dance with Sreeleela for Kurchi madatha petti Song - Sakshi

తమిళ హీరో శివకార్తికేయన్‌ చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కమల్‌ హాసన్‌ నిర్మాతగా తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న అమరన్‌ చిత్రం కాగా, మరొకటి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. అమరన్‌ చిత్రంలో శివకార్తికేయన్‌ సైనికుడిగా పవర్‌ఫుల్‌ పాత్రను పోషిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న SK23వ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఈ రెండూ కమర్షియల్‌ ఫార్మాట్‌లో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రాలు కావడం గమనార్హం. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శివకార్తికేయన్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రీలీలతో డ్యాన్స్‌ చేశాడు. వీళ్లు డ్యాన్స్‌ చేసింది సినిమాలో కాదు.. ఓ స్టేజీపై!

ఇటీవల తిరుచ్చిలోని ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న శివకార్తికేయన్‌, శ్రీలీల గుంటూరు కారంలోని కుర్చీని మడత పెట్టి అనే పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

చదవండి: పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్త ఎవరో చెప్పిన బర్రెలక్క

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement