చాలా అవకాశాలు కోల్పోయాను..! | Mrunal Thakur says she missed out on many movies due to kissing scenes | Sakshi
Sakshi News home page

చాలా అవకాశాలు కోల్పోయాను..!

Aug 11 2024 12:31 PM | Updated on Aug 11 2024 1:05 PM

Mrunal Thakur says she missed out on many movies due to kissing scenes

సీతారామం చిత్రం పేమ్‌ నటి మృణాల్‌ ఠాకూర్‌ గురించి ఇప్పుడు పరిచయం అవసరం ఉండదనుకుంటా. ఈ బెంగాలీ బ్యూటీ మాతృభాషలోనే కాకుండా కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించారు. అయితే ఆయా చిత్రాల్లో రాని పేరు తెలుగులో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటించిన సీతారామమ్‌ చిత్రంతో వచ్చింది. ఆ చిత్రంతో ఒక్క సారిగా దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌ అయ్యిపోయ్యారు. ఆ తరువాత  నానితో జత కట్టిన హాయ్‌ నాన్నా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే  విజయ్‌ దేవరకొండతో నటించిన  ఫ్యామిలీస్టార్‌ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. 

దీంతో తెలుగులో అవకాశాలు దూరం అయ్యాయనే చెప్పాలి. కాగా తమిళంలో నటుడు శివకార్తికేయన్‌కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకున్నారనే ప్రచారం జరిగింది. ఇకపోతే సీతారామమ్‌ వంటి చిత్రాల్లో హోమ్లీగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ ఆ తరువాత గ్లామర్‌ వైపు మొగ్గు చూపారు. ముద్దు సన్నివేశాల్లోనూ నటించి ఆమె తల్లిదండ్రులకు షాక్‌ ఇచ్చారు. అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని మృణాల్‌ ఠాకూర్‌ తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారట. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను సినిమాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నారు. 

దీంతో పలు అవకాశాలను కోల్పోయానన్నారు. ఆ తరువాత తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, తన తల్లిదండ్రులని పిలిచి లిప్‌లాక్‌ వంటి సన్నిహిత సన్నివేశాల్లో నటించడం తనకూ భయమేనని,అయితే ఈ రంగంలో అలాంటివి చాలా అవసరం అనీ, ఇది తన ఛాయిస్‌ కాదనీ వివరించి చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తరువాతనే ఈ అమ్మడు ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి రెడీ అంటున్నారట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement