
నిర్మాతగా శివకార్తికేయన్
నటుడు శివకార్తికేయన్ చిత్ర నిర్మాతగా మారారు. ‘మెరీనా’,‘కేడి బిల్లా కిలాడి రంగా’, ‘వరుత్తపడాద
టీనగర్: నటుడు శివకార్తికేయన్ చిత్ర నిర్మాతగా మారారు. ‘మెరీనా’,‘కేడి బిల్లా కిలాడి రంగా’, ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం’, ‘మాన్ కరాతే’, ‘కాకి చట్టై’ వంటి చిత్రాల్లో నటించిన శివకార్తికేయన్, ప్రస్తుతం హీరోగా ఉన్నారు. ప్రస్తుతం లింగుసామి రూపొందిస్తున్న ‘రజిని మురుగన్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈయన కాల్‌షీట్స్ పొందేందుకు అనేక మంది నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే తానే నిర్మాతగా మారి నటించేందుకు నిర్ణయించారు శివకార్తికేయన్. ఆయన స్నేహితుడు ఆర్‌టీ రాజాతో కలిసి చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రాన్ని అట్లి వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన భాగ్యరాజ్ భారతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. శివకార్తికేయన్‌కు జంటగా సమంత నటిస్తున్నారు.