ప్రమోషన్స్‌కు సిద్ధమైన మహా వీరుడు, అప్పుడే ఆడియో లాంచ్‌ | Sivakarthikeyan Maaveeran Audio Launch Update | Sakshi
Sakshi News home page

ప్రమోషన్స్‌కు సిద్ధమైన మహా వీరుడు, ఆడియో లాంచ్‌తో షురూ..

Published Mon, Jun 12 2023 7:06 PM | Last Updated on Mon, Jun 12 2023 7:06 PM

Sivakarthikeyan Maaveeran Audio Launch Update - Sakshi

దర్శకుడు శంకర్‌ వారసురాలు ఆదితిశంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో యోగిబాబు, దర్శకుడు

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మావీరన్‌. దర్శకుడు శంకర్‌ వారసురాలు ఆదితిశంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో యోగిబాబు, దర్శకుడు మిష్కిన్‌, సరిత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత, మండేలా చిత్రం ఫేమ్‌ మడోనా అశ్విన్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తుండగా శాంతి టాకీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో జూలై 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలుగులో మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి డబ్బింగ్‌ను శివకార్తికేయన్‌ ఇటీవలే పూర్తి చేశారు. కాగా చిత్ర విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందడం విశేషం. భరత్‌ శంకర్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూలై 2న భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు సమాచారం. చైన్నెలోని సాయిరాం కాలేజీలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నటుడు శివకార్తికేయన్‌ ఇంతకుముందు నటించిన రెండు చిత్రాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇదే కాలేజీలో నిర్వహించారన్నది గమనార్హం.

చదవండి: సీఎం జగన్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్‌ ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement