Aditi Shankar Gets Less Remuneration For A Movie In Kollywood, Deets Inside - Sakshi
Sakshi News home page

Aditi Shankar Remuneration: కోట్లలో హీరోయిన్ల రెమ్యునరేషన్.. ఆమెకు మాత్రం లక్షల్లోనే!

Published Thu, Jul 13 2023 9:22 AM | Last Updated on Thu, Jul 13 2023 10:27 AM

Aditi Shankar Gets Less Remuneration For a Movie Kollywood - Sakshi

అందం, తెలివి, చలాకీతనం ఉన్న నటి అదితిశంకర్‌. ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసురాలు, విద్యావంతురాలు, గాయని అన్నవి అదనపు అర్హతలు..ఈమె వైద్య వృతి చదివి నటిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. విరుమాన్‌ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రథమ చిత్రంతో పాస్‌ అయిన అదితిశంకర్‌ ఇప్పుడు ద్వితీయ విజ్ఞాన్ని అధికమించడానికి సిద్ధమయ్యారు.

(ఇది చదవండి: ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్)

తాజాగా నటుడు శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మావీరన్‌ చిత్రం రేపు తెరపైకి రానుంది. మండేలా చిత్రం ఫేమ్‌ మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శాంతి పిక్చర్స్‌ పతాకంపై అరుణ్‌ నిర్మించారు. ఇందులో నటి అదితి శంకర్‌ పాత్రికేయరాలిగా చురుకైన పాత్రలో నటించినట్లు ఇటీవల ఓ భేటీలో దర్శకుడు తెలిపారు. కాగా నటి అదితి శంకర్‌ గురించి మీడియాలో ఒక విషయం వైరల్‌ అవుతోంది.

అదేమిటంటే ఈమెకు తన తండ్రి శంకర్‌ సిఫార్సుతోనే అవకాశాలు వస్తున్నాయని.. దీనిపై స్పందించిన అదితి శంకర్‌ ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. ఇంత వరకూ నాన్న ద్వారా ఒక్క చిత్రం కూడా రాలేదని చెప్పారు. అదితి చేయగలదని భావించి కథలతో దర్శక నిర్మాతలు వస్తున్నారనీ.. తాను మొదట కథ విన్న తరువాత నాన్నకు చెబుతానన్నారు. ఆయన అనుమతితోనే ఆ చిత్రంలో నటించే విషయం గురించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

(ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న రష్మిక.. ఛాన్స్‌ కొట్టేసిన యంగ్ హీరోయిన్!)

తనకు నాన్న సపోర్టు ఉంటుందని పేర్కొన్నారు. మీ నాన్న పెద్ద దర్శకుడు ఆయన దర్శకత్వంలో నటిస్తారా? అన్న ప్రశ్నకు అలాంటి ఆశ తనకూ ఉందని చెప్పారు. దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు లేదని స్పష్టం చేశారు. అయితే మ్యూజిక్‌ ఆల్బం చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. కాగా ఈ బ్యూటీ తదుపరి విష్ణువర్థన్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు చెప్పారు. అయితే ఆమె చిత్రానికి తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? కేవలం రూ. 25 లక్షలు మాత్రమేనట. దీనిపై కొందరు ఆమేకేంటి తండ్రి కోట్లు సంపాదిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement